సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్ , రానా కు జోడీ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here’s the First Glimpse of the POWER Storm ⚡#BHEEMLANAYAK is here 🔥
Coming to rule your playlists from Sept 2nd 🎶🥁#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @MenenNithya @MusicThaman @saagar_chandrak @dop007 @NavinNooli @vamsi84
— Sithara Entertainments (@SitharaEnts) August 15, 2021
ఈ రీమేక్ మూవీ లో పవన్ కల్యాణ్, భీమ్లా నాయక్ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. “భీమ్లా నాయక్ ” టైటిల్ ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా “భీమ్లా నాయక్ ” మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. పవన్ బ్లాక్ కలర్ షర్ట్, లుంగీలో కోపంతో ఊగిపోతూ డైలాగ్ చెప్పడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్ “మూవీ తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న “భీమ్లా నాయక్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: