సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో “లక్ష్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక.ఈమూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీ తో అలరించనున్నారు. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“లక్ష్య “మూవీ యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రతీ శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక కొత్త అప్‌డేట్‌ను చిత్రయూనిట్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.ఒక శుక్రవారం “లక్ష్య” సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్ ను ఒక శుక్రవారం కేతిక శర్మ గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా “లక్ష్య” మూవీ మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “లక్ష్య “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: