యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం సూర్య ప్రతాప్ దర్శకత్వంలో “18 పేజెస్ “, చందు మొండేటి దర్శకత్వంలో “కార్తికేయ 2 ” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ రెండు మూవీస్ షూటింగ్స్ నిలిచిపోయాయి. కరోనా బాధితులకు హీరో నిఖిల్ తన వంతు సాయం అందించారు. రీసెంట్ గా “18 “పేజెస్ “మూవీ షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసిన హీరో నిఖిల్ స్పై- యాక్షన్ కథాంశంతో ఉన్న ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిఖిల్ హీరో గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెడ్ సినిమాస్ బ్యానర్ పై సూపర్ హిట్ “గూఢచారి”, “ఎవరు”, “HIT” మూవీస్ ఫేమ్ ఎడిటర్ గ్యారీ బి హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. సరిహద్దులో భారతీయ జెండా , సైనికులతో పాటు విదేశీ లొకేషన్లు ఉన్న పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.విభిన్న తరహా సినిమాలు ఎంపిక చేసుకుంటున్న హీరో నిఖిల్ మొదటిసారిగా గూఢచారిగా నటించే అవకాశంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: