థియేటర్లు ఓపెన్ అవ్వడంతో హీరోలందరూ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇక యంగ్ హీరో సుధీర్ బాబు కూడా శ్రీదేవి సోడా సెంటర్ తో సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆనంది హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఈ చిత్రంలో సుధీర్ బాబు లైటింగ్ సూరిబాబుగా , ఆనంది శ్రీదేవిగా కనిపించబోతున్నారు. ఆగష్ట్ 27న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ అన్నీ శ్రీదేవి సోడా సెంటర్ సినిమాపై ఆసక్తితో పాటు అంచనాలను కూడా పెంచేసాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ట్రైలర్ రిలీజ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు అంటే ఆగష్ట్ 19న ఉదయం 10 గంటలకు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
సూపర్‌స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయనున్నట్టు తెలిపారు.
Me and @Satyamrajesh2 had to paste a poster in theatre to save the publicity cost?? 😬 Naaa … we had to do that because THIS IS A SUPERSPECIAL ANNOUNCEMENT 😎
Watch this and wait for 19th Aug, 10 am 🔥https://t.co/wsWDqXo2fR#SrideviSodaCenter #SrideviSodaCenterOn27thAug— Sudheer Babu (@isudheerbabu) August 18, 2021
కాగా ఈసినిమాలో ఇంకా నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి, స్నేహ గుప్త తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాగా 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























