కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో బాక్సింగ్ నేపథ్యంలో గని సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ఒకపక్క షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక దీపావళికి ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాలో నవీన్ చంద్ర కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో నవీన్ చంద్ర బాక్సింగ్ గురించి పలు విషయాలు చెప్పాడు. బాక్సర్ గా చేయడం ఒక ఛాలెంజ్.. నేషనల్ లెవల్ బాక్సర్స్ తో మూడు నెలలు పాటు ట్రైనింగ్ తీసుకున్నా.. సెట్ లో బాక్సింగ్ గ్లౌజ్ లు వేసుకొని గంటలు గంటలు షూటింగ్ చేయాల్సి వచ్చేది.. వరుణ్ తేజ్ చాలా ఎంకరేజ్ అండ్ సపోర్ట్ ఇచ్చేవాడు.. మేకోవర్ కోసం చాలా డైట్ చేయాల్సి వచ్చింది.. అంటూ బాక్సర్ పాత్ర కోసం ఎంత కష్టపడ్డాడో చెప్పుకొచ్చాడు. మరి సినిమా హిట్ అయితే ఆ కష్టానికి ఫలితం దక్కినట్టే.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుంది. ఇంకా సునీల్ శెట్టి, జగపతిబాబు లాంటి స్టార్లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: