
ట్యాగ్ · 394 కథనాలు


'భీమ్లా నాయక్' యూఎస్ ప్రీమియర్ డేట్ కన్ఫామ్..!

"భోళా శంకర్"మూవీ అప్ డేట్

పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ 'భీమ్లా నాయక్'

'భీమ్లా నాయక్' షూటింగ్ అప్ డేట్..!

డబ్బింగ్ పూర్తి చేసిన 'మేజర్'

సంక్రాంతి బరిలో ఎం.ఎస్ రాజు '7 డేస్ 6 నైట్స్'

'ఒకే ఒక జీవితం' టీజర్ రిలీజ్

'శాకుంతలం' ఒక మ్యాజికల్ మూవీ

'పుష్ప' టీమ్ లో ప్రతి ఒక్కరికీ 'రూ. 1లక్ష'

'పుష్ప' థ్యాంక్స్ మీట్ లో బన్నీ ఎమోషనల్..!

"భీమ్లా నాయక్"లో పవన్ కళ్యాణ్ డాషింగ్ లుక్

'చైతు' సింప్లిసిటీకి ఫ్యాన్ ఫిదా..!

ఎన్టీఆర్ కు జోడీ గా సామ్.. ఇదే క్లారిటీ..!

శ్యామ్ సింగ రాయ్ మూవీ పబ్లిక్ టాక్

'రాధేశ్యామ్' ట్రైలర్ రిలీజ్

"భీమ్లా నాయక్" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” తెరకెక్కిన విషయం తెలిసిందే. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందించారు. "భీమ్లా నాయక్”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'భీమ్లా నాయక్' యూఎస్ ప్రీమియర్ డేట్ కన్ఫామ్..!
సాగర్.కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ హీరో రానా ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ భీమ్లానాయక్. ఈ సినిమా కోసం అటు పవన్ అభిమానులతో పాటు రానా అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా సంక్రాంతికే రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక కొత్తగా మరో రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఫిబ్రవరి25 న ఈసినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

"భోళా శంకర్"మూవీ అప్ డేట్
ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. చిరంజీవికి కీర్తీ సురేశ్ రాఖీ కడుతున్న ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మెగా స్టార్ చిరంజీవి , కీర్తి సురేష్ ల వీడియో క్లిప్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.“భోళా శంకర్”మూవీ లోని తన పాత్ర కోసం చిరంజీవి పూర్తి డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించబోతున్నారు.

పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ 'భీమ్లా నాయక్'
సాగర్.కె చంద్ర దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భీమ్లా నాయక్. రానా దగ్గుబాటి ఇందులో మరో హీరోగా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ సాంగ్స్ అన్ని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా రిలీజ్ గురించి కూడా తెలిసిందే కదా. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. అది కూడా వాయిదా పడింది. ఫైనల్ గా ఫిబ్రవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'భీమ్లా నాయక్' షూటింగ్ అప్ డేట్..!
సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ భీమ్లానాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియనుమ్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ ను జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, ఇంట్రడక్షన్ టీజర్లు, టీజర్లు, పాటలు రిలీజ్ కాగా అవి ఎంత రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయో చూశాం కదా. ఇక ఈసినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈసినిమాను ముందు సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ కొన్ని…

డబ్బింగ్ పూర్తి చేసిన 'మేజర్'
టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో మేజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే అందరి పాత్రల డబ్బింగ్ కూడా పూర్తయిపోయింది. ఇక రీసెంట్ గానే అడివి శేష్ ఈసినిమా డబ్బింగ్ ను మొదలుపెట్టగా తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు తన డబ్బింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తను వేరే కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నా కూడా ఈసినిమా పనులు తన వల్ల లేట్ అవ్వకూడదన్న ఉద్దేశంతో బిజీ షెడ్యూల్ లో కూడా తన డబ్బింగ్ ను పూర్తి చేసినట్టు చెబుతున్నాడు. ఇక హిందీలో కూడా అడివి శేష్ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు.

సంక్రాంతి బరిలో ఎం.ఎస్ రాజు '7 డేస్ 6 నైట్స్'
ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఎం.ఎస్ రాజు కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. 'డర్టీ హరి'తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఆ సినిమాతో సక్సెస్ కొట్టాడు ఎం.ఎస్ రాజు. ఇక ఆసినిమా ఇచ్చిన సక్సెస్ తో ఎం.ఎస్ రాజు '7 డేస్ 6 నైట్స్' లాంటి యూత్ ఎంటర్టైనర్ తో వచ్చేస్తున్నాడు. ఈసినిమాను కరోనా ప్రభావం తగ్గిన తరువాతే స్టార్ట్ చేశారు. అయినా కూడా ఎం.ఎస్ రాజు అన్ని జాగ్రత్తలు తీసుకొని చాలా ఫాస్ట్ గానే షూట్ ను కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుంది.

'ఒకే ఒక జీవితం' టీజర్ రిలీజ్
యంగ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది రెండు సినిమాలతో అలరించాడు. ఈ ఏడాది ప్రధమార్థంలో శ్రీకారం సినిమాను రిలీజ్ చేయగా.. రీసెంట్ గానే మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ చేస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈసినిమాను చేస్తున్నాడు శర్వా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ కరోనా వల్ల చాలా ఆలస్యమైంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుండగా.. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్…

"భీష్మ పర్వం "మలయాళ మూవీ లో అనసూయ లుక్
సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. "క్షణం ", “రంగస్థలం“మూవీస్ లో అనసూయ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి , బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం "ఆచార్య "“రంగమార్తాండ “, “ఖిలాడి “, “ఫ్లాష్ బ్యాక్ ”, "పక్కా కమర్షియల్ " "గాడ్ ఫాదర్ " మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.
నెవర్ బిఫోర్ ఇండియన్ సినిమాగా "పుష్ప 2 "రిలీజ్ చేస్తా - అల్లు అర్జున్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో 200క్లబ్ దిశగా దూసుకుపోతోంది.“పుష్ప: ది రైజ్” మూవీ కలెక్షన్స్ US లో 2మిలియన్ డాలర్స్ చేరువలో ఉన్నాయి. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ…

'శాకుంతలం' ఒక మ్యాజికల్ మూవీ
టాలీవుడ్ స్టార్ హీరో సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ్‌తోపాటు అటు బాలీవుడ్‌లోను వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతుంది. ఇక ప్రస్తుతం సామ్ తెలుగులో నటించిన సినిమా శాకుంతలం. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. రుద్రమదేవి లాంటి సినిమా తరువాత గుణశేఖర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి.

'భీమ్లా నాయక్' సర్ ప్రైజింగ్ అప్ డేట్.. రానున్న లాలా భీమ్లా డీజే వెర్షన్
సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ భీమ్లానాయక్. నిజానికి ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయాల్సి ఉంది. సినిమా వాయిదా పడుతుందంటూ ఎన్ని సార్లు వార్తలు వచ్చినా వాటిని మేకర్స్ ఖండించుకుంటూ వచ్చారు. కానీ ఫైనల్ గా రిలీజ్ డేట్ ను అయితే మార్చారు. రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను మార్తుస్తూ కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ‘భీమ్లా నాయక్’ను శివ రాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నారు.

'పుష్ప' టీమ్ లో ప్రతి ఒక్కరికీ 'రూ. 1లక్ష'
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 లాంటి హిట్ మూవీల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ నెల 17న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాగా సూపర్ హిట్ తో హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా.. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. బన్నీ ఊర మాస్ యాక్టింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరోవైపు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ తో బిజీ అయిపోయారు.

'పుష్ప' థ్యాంక్స్ మీట్ లో బన్నీ ఎమోషనల్..!
సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఎన్నో అంచనాల మధ్య ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ తో అందరి ప్రశంసలను దక్కించుకుంటుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో బన్నీ పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ లుక్‌లో అదరగొట్టాడు. అందుకే సౌత్ లో మాత్రమే కాదు నార్త్ లో కూడా పుష్ప రాజ్ తన హవాను చూపిస్తున్నాడు.

"భీమ్లా నాయక్"లో పవన్ కళ్యాణ్ డాషింగ్ లుక్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని అనివార్యకారణాల వల్ల ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీ గా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

'చైతు' సింప్లిసిటీకి ఫ్యాన్ ఫిదా..!
టాలీవుడ్ లో మన హీరోలను అభిమానులు ఎలా ఆరాధిస్తారో మనకు తెలిసిందే. హీరోలను ఆ రేంజ్ లో అభిమానించడం మన దగ్గరే కాస్త ఎక్కువ ఉంటుంది. ఇక హీరోలు కూడా తమ అభిమానులను అలానే చూస్తుంటారు. ఫ్యాన్స్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అందుకే తమ ప్రతి సక్సెస్ లో అభిమానుల పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఒక సంఘటనలో నాగచైతన్య సింప్లిసిటీకి ఒక ఫ్యాన్ ఫిదా అయి తన ఎక్స్ పీరియన్స్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం జరిగింది.

ఎన్టీఆర్ కు జోడీ గా సామ్.. ఇదే క్లారిటీ..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరోను సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరగా 2018 లో ‘అరవింద సమేత’ సినిమాతో బిగ్ స్క్రీన్ పై అలరించాడు ఎన్టీఆర్. ఇక దాదాపు మూడేళ్లకు పైగా ఈసినిమాతోనే బిజీగా ఉండగా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈసినిమాకు ఎంత బజ్ క్రియేట్ అయిందో చూశాం. దానికి తోడు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చాలా భారీగా చేస్తున్నాడు రాజమౌళి. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఎక్కడా తగ్గకుండా చిత్రయూనిట్ మొత్తం ప్రమోషన్స్ చేస్తుంది. ఇక రాజమౌళి మ్యాజిక్ ను చూడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

నాని 'శ్యామ్ సింగ రాయ్' రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే నాని సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కలిసి చూసే సినిమా కాబట్టే ఈసినిమాను కూడా అందరూ చూడొచ్చు. ఒక కొత్త విషయాన్ని ఈసినిమా ద్వారా తెలుసుకోవచ్చు.

శ్యామ్ సింగ రాయ్ మూవీ పబ్లిక్ టాక్
Hittu Kottesav bro @NameisNani 🙌 Acting kummesav🥁@Sai_Pallavi92 asusual adargottav🔥 Proud to be a fan🤗🥺💙#SaiPallavi #ShyamSinghaRoy Mickey sir…

'రాధేశ్యామ్' ట్రైలర్ రిలీజ్
బాహుబలి, సాహో లాంటి సినిమాల తరువాత ప్రభాస్ నుండి వస్తున్న మరో పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఈసినిమాతో మరోసారి లవర్ బాయ్ లా మారిపోయాడు ప్రభాస్. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా కానీ అనేక కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దాదాపు రెండు సంవత్సరాలతర్వాత ప్రభాస్ నుంచి సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.