సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ భీమ్లానాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియనుమ్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ ను జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, ఇంట్రడక్షన్ టీజర్లు, టీజర్లు, పాటలు రిలీజ్ కాగా అవి ఎంత రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయో చూశాం కదా. ఇక ఈసినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈసినిమాను ముందు సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ కొన్ని పరిస్థితుల రీత్యా ఈ సినిమాను వాయిదా వేశారు. ఫిబ్రవరి 25న ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈసినిమాకు సంబంధించి ఇంకొంత షూటింగ్ మిగిలి ఉన్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో ఈ నెల 25 నుంచి చిత్రీకరణ జరిపేందుకు షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ పోర్షన్ ను కూడా పూర్తి చేసి చెప్పిన డేట్ కే ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. చూద్దాం మరి చెప్పిన డేట్ కు రిలీజ్ అవుతుందో?లేదో?
కాగా పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాకి జంటగా సంయుక్త మీనన్ నటిస్తుండగా.. సముద్రఖని, మురళీశర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: