సాగర్.కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ హీరో రానా ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ భీమ్లానాయక్. ఈ సినిమా కోసం అటు పవన్ అభిమానులతో పాటు రానా అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా సంక్రాంతికే రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక కొత్తగా మరో రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఫిబ్రవరి25 న ఈసినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే గత కొద్ది రోజులుగా ఆ రోజు కూడా రిలీజ్ అవుతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ తాజాగా వినిపిస్తున్నవార్తల ప్రకారం ఈసినిమా యూఎస్ ప్రీమియర్ షో డేట్ కన్ఫామ్ అయిందని.. ఫిబ్రవరి 24న ప్రీమియర్ షో పడనుందని అంటున్నారు. చూద్దాం మరి దీనిపై క్లారిటీ రావాలంటే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించాల్సిందే.
ఇక మరోవైపు ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు థమన్ చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాయి. తాజాగా థమన్ సోషల్ మీడియా ద్వారా చిట్ చాట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన.. భీమ్లా నాయక్ రోల్ పవన్ కెరీర్ లోనే బెస్ట్ అవుతుందని.. ఈ సినిమా పవన్‌కి బిగ్గెస్ట్ హిట్ అవుతుందని, పవన్ అందరినీ షాక్‌కి గురి చేస్తాడని ఆయన అన్నారు.
కాగా పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాకి జంటగా సంయుక్త మీనన్ నటిస్తుండగా.. సముద్రఖని, మురళీశర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: