యంగ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది రెండు సినిమాలతో అలరించాడు. ఈ ఏడాది ప్రధమార్థంలో శ్రీకారం సినిమాను రిలీజ్ చేయగా.. రీసెంట్ గానే మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ చేస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈసినిమాను చేస్తున్నాడు శర్వా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ కరోనా వల్ల చాలా ఆలస్యమైంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుండగా.. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక టీజర్ ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి లతో పాటు.. ఈ సినిమాలో అక్కినేని అమల ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇక ఈసినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటిస్తారేమో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: