సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ భీమ్లానాయక్. నిజానికి ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయాల్సి ఉంది. సినిమా వాయిదా పడుతుందంటూ ఎన్ని సార్లు వార్తలు వచ్చినా వాటిని మేకర్స్ ఖండించుకుంటూ వచ్చారు. కానీ ఫైనల్ గా రిలీజ్ డేట్ ను అయితే మార్చారు. రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను మార్తుస్తూ కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ‘భీమ్లా నాయక్’ను శివ రాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా జోరు తగ్గించడంలేదు చిత్రబృందం. ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ మంచి హైప్ ను అయితే క్రియేట్ చేయగలిగారు. మొదట విడుదల చేసిన పవన్ ఇంట్రడక్షన్ వీడియో నుండి ఇప్పటివరకూ వచ్చిన పోస్టర్లు కానీ, పాటలు, టీజర్ అన్నీసినిమాపై క్రేజ్ ను పెంచేశాయి. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి మరో పాటను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే విశేషం ఏంటంటే ఈ పాట లాలా భీమ్లా పాటకు డీజే వెర్షన్. డీజే వెర్షన్ ని ఈ డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటల 2 నిమిషాసకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
Celebrate the New Year with the BLASTING Explosion of #LaLaBheemlaDJVersion🔥🥁
Out on 31st Dec at 07:02pm 💥🤙#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @vamsi84 @dop007 @NavinNooli @adityamusic pic.twitter.com/HWsSAiHaoF
— Sithara Entertainments (@SitharaEnts) December 29, 2021
కాగా పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాకి జంటగా సంయుక్త మీనన్ నటిస్తుండగా.. సముద్రఖని, మురళీశర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: