టాలీవుడ్ స్టార్ హీరో సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ్‌తోపాటు అటు బాలీవుడ్‌లోను వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతుంది. ఇక ప్రస్తుతం సామ్ తెలుగులో నటించిన సినిమా శాకుంతలం. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. రుద్రమదేవి లాంటి సినిమా తరువాత గుణశేఖర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటుంది. అయితే ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ ఎలాంటి పోస్టర్ కూడా బయటకు రాకుండా గుణశేఖర్ చాలా కేర్ తీసుకున్నాడు. ఈ సినిమాలో నటీనటులు ఎలా ఉండబోతున్నారన్నది కూడా బయటకు తెలియడం లేదు. దాంతో సినిమా పై ఆసక్తి పెరిగింది. మరోవైపు ఈ సినిమా నుంచి సామ్ లుక్ ఎప్పుడు ఎప్పుడు బయటకు వస్తుందా అని సమంత అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈనేపథ్యంలో సమంత మేకప్ ఆర్టిస్ట్ సద్నా సింగ్ తాజాగా సోషల్ మీడియాలో ముచ్చటించగా ఈసినిమాలో సమంత లుక్ గురించి.. ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది. శాకుంతలం సినిమా ఒక మ్యాజికల్.. సమంత లుక్, మ్యూజిక్, స్టోరీ మొత్తంగా శాకుంతలం ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది.. ఈసినిమాను ఆడియన్స్ ఎప్పుడు చూసి ఆ అనుభూతిని ఎక్స్ పీరియన్స్ చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ తెలిపింది. ఇక ఈ విషయాన్ని ఈసినిమాకు నిర్మాతగా ఉన్నా నీలిమ గుణశేఖర్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ సద్నాకు థ్యాంక్స్ చెప్పింది.
#Samantha’s makeup artist Sadhna Singh about her work experience for #Shaakuntalam during her QnA session on Instagram when I asked her about this ✨♥️ I Thank her for her hard work ..truly Shakuntala is Sadhna’s masterstroke in terms of acing that ethereal skin and subtlety 🦢✨ pic.twitter.com/qT3GcXQJYJ
— Neelima Guna (@neelima_guna) December 27, 2021
కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంత్‌గా, అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 2022 ప్రధమార్థంలో ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: