టాలీవుడ్ లో మన హీరోలను అభిమానులు ఎలా ఆరాధిస్తారో మనకు తెలిసిందే. హీరోలను ఆ రేంజ్ లో అభిమానించడం మన దగ్గరే కాస్త ఎక్కువ ఉంటుంది. ఇక హీరోలు కూడా తమ అభిమానులను అలానే చూస్తుంటారు. ఫ్యాన్స్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అందుకే తమ ప్రతి సక్సెస్ లో అభిమానుల పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఒక సంఘటనలో నాగచైతన్య సింప్లిసిటీకి ఒక ఫ్యాన్ ఫిదా అయి తన ఎక్స్ పీరియన్స్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నవీన్ అనే నెటిజన్ తన ఇన్స్టా ద్వారా.. గోవాలో మేము ఒక రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తుండగా మా వెనుక కొంతమంది డిన్నర్ చేస్తున్నారు. ఒకసారి వెనక్కి తిరిగి చూడగా నాగ చైతన్య కనిపించారు. మేము నాగ చైతన్య అవునా?కాదా? అన్న డౌట్ లోనే చాలా సార్లు చూస్తూనే ఉన్నాం. తను నిజంగా నాగ చైనత్యనే.. డిన్నర్ అయిపోయిన తరువాత నాగ చైతన్య సెల్ఫీ ఇస్తారో లేదో అని అక్కడ వెయిట్ చేశాం.. సెల్ఫీ ఇస్తారో లేదో అని అడిగించాం.. కానీ నాగచైతన్య మాత్రం మా దగ్గరికి వచ్చి సెల్ఫీ ఇచ్చారు. ఒకసారి సరిగ్గా రాకపోయినా రెండోసారి తనే సెల్ఫీ తీశారు. ఒక స్టార్ హీరో గా ఉన్నా కూడా తను చాలా సింప్లిసిటీతో ఉన్నాారు. అందుకే ఈవిషయాన్ని అందరితో పంచుకోవాలని షేర్ చేస్తున్నాను అంటూ తెలిపారు.ఇక ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
View this post on Instagram
కాగా ప్రస్తుతం నాగ చైతన్య థాంక్యూ సినిమా చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీనితో పాటు బంగార్రాజు సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. అలాగే లాల్ సింగ్ చద్దా అనే సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: