ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. చిరంజీవికి కీర్తీ సురేశ్ రాఖీ కడుతున్న ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మెగా స్టార్ చిరంజీవి , కీర్తి సురేష్ ల వీడియో క్లిప్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.“భోళా శంకర్”మూవీ లోని తన పాత్ర కోసం చిరంజీవి పూర్తి డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“భోళా శంకర్ “మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈమూవీ సెట్స్ లో హీరో చిరంజీవి , కీర్తి సురేష్ జాయిన్ అయ్యారు. ఒక వైపున కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి మొన్నటి నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. చిరంజీవి కాంబినేషన్ లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమా హైలైట్స్ లో ఒకటిగా కనిపిస్తాయని సమాచారం. మెగా స్టార్ చిరంజీవి పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: