నాని ‘శ్యామ్ సింగ రాయ్’ రివ్యూ

#Nani, #ShyamSinghaRoy, 2021 Latest Telugu Movie Reviews, Krithi Shetty, Krithi Shetty Movies, Latest Movie Reviews, Latest Telugu Movie 2021, Latest Telugu Movie Reviews, Latest Telugu Reviews, Latest Tollywood Reviews, Nani Latest Movie, Nani Movies, Nani New Movie, Nani Shyam Singha Roy, Nani Shyam Singha Roy Movie, Nani Shyam Singha Roy Movie Review, Nani Shyam Singha Roy Review, New Telugu Movie, New Telugu Movies 2021, Rahul Sankrithyan, Sai Pallavi, Sai Pallavi Movies, Sai Pallavi New Movie, Shyam Singha Roy, Shyam Singha Roy Movie, Shyam Singha Roy Movie Latest News, Shyam Singha Roy Movie Latest updates, Shyam Singha Roy Movie Live Updates, Shyam Singha Roy Movie Public Response, Shyam Singha Roy Movie Public Talk, Shyam Singha Roy Movie Public Talk And Public Response, Shyam Singha Roy Movie Rating, Shyam Singha Roy Movie Review, Shyam Singha Roy Movie Review And Rating, Shyam Singha Roy Movie Story, Shyam Singha Roy Movie Update, Shyam Singha Roy Movie Updates, Shyam Singha Roy Public Response, Shyam Singha Roy Public Talk, Shyam Singha Roy Rating, Shyam Singha Roy Review, Shyam Singha Roy Songs, Shyam Singha Roy Teaser, Shyam Singha Roy Telugu Movie, Shyam Singha Roy Telugu Movie Latest News, Shyam Singha Roy Telugu Movie Live Updates, Shyam Singha Roy Telugu Movie Public Talk, Shyam Singha Roy Telugu Movie Review, Shyam Singha Roy Telugu Movie Updates, Shyam Singha Roy Telugu Trailer, Shyam Singha Roy Trailer, Shyam Singha Roy Updates, Telugu Filmnagar, Telugu Movie Reviews, Telugu Reviews

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన సినిమా శ్యామ్ సింగరాయ్. ఈసినిమాతో డిఫరెంట్ గా వస్తున్నాడు నాని. అంతేకాదు ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక భారీ అంచనాల నేపథ్యంలో ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌, జిషు సేన్ గుప్తా, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, అభినవ్ గోమటం తదితరులు
డైరెక్టర్.. రాహుల్ సంకృత్యన్‌
నిర్మాత..వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి
బ్యానర్.. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
సంగీతం.. మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫి.. జాన్ వర్గీస్

కథ

వాసు (నాని) కి సినిమాలంటే పిచ్చి. ఆ పిచ్చితోనే మంచి డైరెక్టర్ కావాలన్న ప్యాషన్ తో తాను చేస్తున్నజాబ్ ను సైతం వదలుకుంటాడు. ఆ క్రమంలోనే మొదట ఒక షార్ట్ ఫిలిం తీస్తాడు. కీర్తి(కీర్తి శెట్టి) తో షార్ట్ ఫిలిం తీయగా.. అది సూపర్ హిట్ అవుతుంది. దాంతో సినిమా తీసే ఛాన్స్ వస్తుంది. ఇక ఆసినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో నాని లైఫ్ టర్న్ అవుతుంది. అయితే.. అదే సినిమాను హిందీలోనూ డైరెక్ట్ చేయాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో పలు సమస్యలు తలెత్తుతాయి. ఆ సమస్యలను ఎదుర్కొనే క్రమంలో నానికి, శ్యామ్ సింగరాయ్ పాత్రకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది బయటపడుతుంది. ఇంతకీ శ్యామ్ సింగ రాయ్ ఎవరు? నానికి,శ్యామ్ సింగ రాయ్ పాత్రకు సంబంధం ఏంటి..? ఈ సినిమాలో దేవదాసి గా చేసిన సాయి పల్లవి పాత్ర ఏమిటి? అనేది ఈసినిమా కథ.

విశ్లేషణ

డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ ఈసినిమాను కూడా చాలా సింపుల్ గా అలానే ఇంట్రెస్టింగ్ గా తీయడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ అంతా మొదటగా వచ్చే వాసు పాత్ర చుట్టూ తిరుగుతుంది. డైరెక్టర్ కావాలనుకోవడం.. దానికోసం వాసు ప్రయత్నాలు.. అలానే లవ్ ఇదంతా ఫస్ట్ హాఫ్ లో.. శ్యామ్ సింగ రాయ్ పాత్ర ఎంట్రీ సెకండ్ హాఫ్ లో చూపించాడు. ఫస్ట్ హాఫ్ కొంచం నార్మల్ కథలాగే సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో శ్యామ్ సింగ రాయ్ ప్రజల హక్కుల కోసం పోరాటం.. సాయి పల్లవితో లవ్ సీన్స్, విప్లవ రచయితగా మారి ,దేవదాసీలకు విముక్తి కలిగించిన తీరు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. శ్యామ్ సింగ్ రాయ్ పాత్రను ఇంటెన్స్ తో నడపటంతో ఎక్కడా బోర్ కొట్టదు.

నిజానికి దేవదాసీ వ్యవస్థ గురించి ఇప్పుడున్న వాళ్లకి పెద్దగా తెలిసే ఛాన్స్ లేదు. అప్పట్లో ఒకటి రెండు సినిమాల్లో చూపించారు. ఇక ఈసారి ఇదే పాయింట్ చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. గుడి లోని దేవుడి ఉత్సవాలలో నాట్య సేవ చేస్తూ ఉంటారు దేవదాసీలు. వారు వివాహం కూడా చేసుకునే పరిస్థితి ఉండదు. అలాంటి ఆచారాలను.. అరికట్టే ప్రయత్నమే చేస్తాడు శ్యామ్ సింగ రాయ్. బెంగాళ్ లో ఉన్న దేవదాసి వ్యవస్దని బేస్ చేసుకుని ఈ సినిమాను తీశాడు.

ఇక నాని గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఏ పాత్రలో అయినా ఒదిగిపోయి నటిస్తాడు కాబట్టి తన నటన సహజంగా ఉంటుంది కాబట్టే న్యాచురల్ స్టార్ అనే బిరుదును సైతం దక్కించుకున్నాడు. ఎప్పటిలాగే ఈసినిమాలో కూడా రెండు డిఫరెంట్ పాత్రల్లో నటించి మెప్పించాడు. మొదటి నుండి ఈసినిమాపై నాని చాలా నమ్మకంతో ఉన్నాడు. నమ్మకానికి తగ్గట్టే ఈసినిమా కూడా ఉంది. ఇక రెండు పాత్రలను డిఫరెంట్ షేడ్స్ లో నటించి మరోసారి న్యాచురల్ స్టార్ అని నిరూపించుకున్నాడు. కామెడీని ఎలాగైతే పండించగలడో.. ఇలాంటి సెటిల్డ్ పాత్రలో కూడా నాని చాలా బాగా నటిస్తాడని మరోసారి నిరూపించాడు. సాయి పల్లవి గురించి కూడా అందరికీ తెలిసిందే. మైత్రేయి అనే దేవదాసి పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. కృతి శెట్టి కూడా తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.

మిక్కిజే మేయర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా సెట్ అయ్యాయి. సినిమాటోగ్రాఫర్ సను జాన్ వర్గే ఈ సినిమాకు ప్రధాన బలం అని చెప్పొచ్చు. విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక ఆర్ట్ డిపార్ట్ మెంట్ కు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే. అప్పటి కలకత్తా వాతావరణం, కాళీ మాత విగ్రహం ఇవన్నీ స్క్రీన్ పై చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి కాబట్టే ప్రతి ఫ్రేమ్ అంత రిచ్ గా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఓవరాల్ గా చెప్పాలంటే నాని సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కలిసి చూసే సినిమా కాబట్టే ఈసినిమాను కూడా అందరూ చూడొచ్చు. ఒక కొత్త విషయాన్ని ఈసినిమా ద్వారా తెలుసుకోవచ్చు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + thirteen =