కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Film News

ట్యాగ్ · 45 కథనాలు · పేజీ 2

Nishabdham Movie Teaser Release Date Locked
ట్రైలర్ & టీజర్

నిశ్శబ్ధం మూవీ టీజర్ రిలీజ్ డేట్

స్టార్ హీరోయిన్ అనుష్క సూపర్ హిట్ మూవీ భాగమతి తరువాత నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ నిశ్శబ్ధం మూవీ US లో చిత్రీకరణ జరుపుకున్న విషయం తెలిసిందే. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన నిశ్శబ్ధం మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన నిశ్శబ్ధం మూవీ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రాజ్ త‌రుణ్‌... సెంటిమెంట్ ఫ‌లిస్తుందా?

కెరీర్ ఆరంభంలో వ‌రుస విజ‌యాల‌తో అల‌రించిన యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌... గ‌త కొంత‌కాలంగా ట్రాక్ త‌ప్పాడు. ఈ నేప‌థ్యంలో... కొత్త చిత్రం `ఇద్ద‌రి లోకం ఒక‌టే`పైనే త‌న ఆశ‌ల‌ను పెట్టుకున్నాడు. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో `అర్జున్ రెడ్డి` ఫేమ్ షాలినీ పాండే నాయిక‌గా న‌టించ‌గా... జి.ఆర్‌. కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న‌ ఈ సినిమాని... క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అనుష్క పాత్ర‌లో దీపికా ప‌దుకొణె?

`అరుంధ‌తి`(2009)... అగ్ర క‌థానాయిక అనుష్క ద‌శ‌, దిశ‌ని మార్చివేసిన చిత్రం. జేజ‌మ్మ‌, అరుంధ‌తి... ఇలా రెండు విభిన్న పాత్ర‌ల్లో త‌న అభిన‌యంతో క‌నువిందు చేసింది స్వీటీ. కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం, శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి నిర్మాణద‌క్ష‌త... వెర‌సి బాక్సాఫీస్ వ‌ద్ద ప‌లు సంచ‌ల‌నాల‌కు కేంద్ర‌బిందువుగా నిల‌చింది `అరుంధ‌తి`. అంతేకాదు... నాయికా ప్రాధాన్య చిత్రాల‌కు స‌రికొత్త ఉత్సాహాన్నిచ్చింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డ‌బ్బింగ్‌లో `అశ్వ‌థ్థామ‌`

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రం `ఛ‌లో`. హోమ్ బేన‌ర్ ఐరా క్రియేష‌న్స్ లో నిర్మిత‌మైన ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్‌ని అందుకున్నాడు శౌర్య‌. అయితే, ఆ త‌రువాత ఇదే సంస్థ‌లో వ‌చ్చిన `@ న‌ర్త‌న‌శాల‌` నిరాశ‌ప‌రిచినా... ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడో సినిమా చేస్తున్నాడు. ఆ చిత్ర‌మే `అశ్వ‌థ్థామ‌`. స్ట‌న్నింగ్ బ్యూటీ మెహ‌రీన్ నాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమా ద్వారా ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌... ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంద‌ని స‌మాచారం. అంతేకాదు... బ్యాలెన్స్ ఉన్న పాట‌ను త్వ‌ర‌లోనే…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి చిత్రంలో తెలుగ‌మ్మాయి?

`అంత‌కుముందు ఆ తరువాత‌` (2013)తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది ఈషా రెబ్బా. మొద‌టి సినిమాతోనే న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగ‌మ్మాయి... ఆపై ప‌లు చిత్రాల్లో త‌న అభిన‌యంతో క‌నువిందు చేసింది. కాగా... గ‌త ఏడాది యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌`లో పూజా హెగ్డే చెల్లెలి పాత్ర‌లో మెరిసిన ఈ టాలెంటెడ్ బ్యూటీకి.... తాజాగా మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో న‌టించే అవ‌కాశం ద‌క్కింద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

హీరో నాని V మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ V మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. సుధీర్ బాబు , నివేత థామస్, అదితి రావు హైదరి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హీరో నాని 25వ మూవీ గా రూపొందుతున్న V మూవీలో నాని ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో నటించడం విశేషం. బాలీవుడ్ సాంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

లాంఛ‌నంగా ప్రారంభమైన సందీప్ కిష‌న్ `A1 ఎక్స్‌ప్రెస్‌`

`నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో సూప‌ర్‌హిట్ సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. సోమ‌వారం ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేటి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ముర‌ళీశ‌ర్మ‌, ర‌ఘుబాబు, సందీప్ కిష‌న్‌ల‌పై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. హ‌కీ…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తెలుగు సంవ‌త్స‌రాదికి నాని సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్‌?

`గ్యాంగ్ లీడ‌ర్‌`తో 24 చిత్రాల ప్ర‌యాణాన్ని పూర్తిచేసుకున్న నేచుర‌ల్ స్టార్ నాని... ప్ర‌స్తుతం త‌న సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్ (25వ చిత్రం) `వి`తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. నాని తొలి చిత్ర ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు, నివేదా థామ‌స్‌, అదితి రావ్ హైద‌రీ ఇత‌ర ప్ర‌ధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ `దిల్‌` రాజు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అమిత్ త్రివేది బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

హైద‌రాబాద్‌లో `రంగ్ దే`

యువ క‌థానాయ‌కుడు నితిన్‌, కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్ ఫ‌స్ట్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `రంగ్ దే`. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి `తొలిప్రేమ‌` ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. టాలీవుడ్‌ రాక్ స్టార్‌ దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు స‌మ‌కూర్చుతున్న‌ ఈ చిత్రానికి ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కుడు పీసీ శ్రీ‌రామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పవర్ స్టార్ సరసన లేడీ సూపర్ స్టార్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టినా... అన‌తికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన‌ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు ప‌వ‌న్‌. కొంతకాలం క్రితం రాజకీయరంగంలోనూ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్... అక్కడ కూడా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే... దాదాపు రెండేళ్ళుగా పాలిటిక్స్‌లో బిజీగా ఉండడం వలన సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన పవన్... మళ్ళీ ఇప్పుడు రీ-ఎంట్రీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు సన్నిహిత వర్గాల సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వెంకటేష్ ను డైరెక్ట్ చేయ‌నున్న‌ ఓంకార్?

బుల్లితెర వ్యాఖ్యాత‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఓంకార్‌... ‘జీనియస్’(2012) చిత్రంతో దర్శకుడ‌య్యాడు. ఆ సినిమా తర్వాత భారీ విరామం తీసుకున్న ఓంకార్‌... దాదాపు మూడేళ్ళ గ్యాప్ అనంత‌రం ‘రాజు గారి గది’తో ప‌ల‌క‌రించాడు. హారర్ కామెడీ ఫిల్మ్‌గా రూపొందిన ఆ చిత్రం మంచి విజ‌యం సాధించింది. అనంతరం... ‘రాజు గారి గది’ సిరీస్‌లో ‘రాజు గారి గది 2’, ‘రాజు గారి గది 3’ తెర‌కెక్కించి అలరించాడు ఓంకార్‌. కాగా... ఇప్పుడు అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ని డైరెక్ట్ చేసే అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్నాడ‌ట ఓంకార్‌.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

అల .. వైకుంఠపురములో .. టబు ఫస్ట్ లుక్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అల .. వైకుంఠపురములో .. మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. చాలా రోజుల తరువాత సీనియర్ హీరోయిన్ టబు ఈ మూవీ లో ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. నివేత పేతురాజ్, సుశాంత్, నవదీప్, జయరామ్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై రుపొంతున్న అల .. వైకుంఠపురములో .. మూవీ కి థమన్ S సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాగ‌చైత‌న్య‌తో `ఆర్ ఎక్స్ 100` డైరెక్ట‌ర్‌?

`ఆర్ ఎక్స్ 100`(2018)తో టాలీవుడ్ దృష్టిని ఆక‌ర్షించిన యువ ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ప‌రిమిత బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్... బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టించింది. ఈ నేప‌థ్యంలో... అజ‌య్ త‌దుప‌రి చిత్రంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఆ మ‌ధ్య ప‌లువురు యువ క‌థానాయ‌కుల కాంబినేష‌న్స్‌లో అజ‌య్ పేరు వినిపించినా... ఇప్ప‌టివ‌ర‌కు త‌న రెండో చిత్రం ప‌ట్టాలెక్క‌లేదు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

యూరప్‌లో బన్నీ, పూజ రొమాన్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బన్నీ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా... టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, జ‌య‌రామ్‌, సునీల్‌, న‌వ‌దీప్‌, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి ఇద్ద‌రు నాయిక‌ల‌తో బాల‌కృష్ణ‌?

‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని... ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి (‘జయ జానకి నాయక’ ఫేమ్) నిర్మించనున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

జయలలిత బయోపిక్ - అన్ని ప్రశ్నలకు సమాధానం

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ను ఇప్పటీకే తెరకెక్కించడానికి పలువురు డైరెక్టర్స్ లైన్ లో వున్న సంగతి తెలిసిందే. అందులో ప్రియదర్శిని దర్శకత్వంలో నిత్యామీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'ది ఐరన్ లేడీ' ఒకటి. ఇక ఈ సినిమా తెరకెక్కుతున్నా అప్పుడెప్పుడో ఫస్ట్ లుక్ అంటూ ఒక్క పోస్టర్ ను రిలీజ్ చేశారు తప్పా ఇప్పటివరకూ పెద్దగా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా లేదన్న నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించడంతో.. నిత్యా మీనన్ గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చింది. సినిమా స్క్రిప్ట్ పనులు దాదాపు ఎండింగ్ కి వచ్చేశాయని.. దాదాపు అన్ని నిజాలే కథలో కనిపిస్తాయని చెప్పింది. అదే విధంగా…

TFN Adminవాట్సాప్
Telugu Filmnagar,Latest Telugu Film News,2019 Telugu Movies News,Tollywood Cinema Updates,Telugu Movies Rocking The Digital Platforms,Latest Telugu Movies Available On Digital Platforms,New Telugu Movies Available On Digital Platforms,Most Popular OT
సినిమా వార్తలు

ఆన్ లైన్ లో సందడి చేస్తున్న సినిమాలు

కనీసం వారానికో సినిమా అయినా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉంటుంది. ఇక సినిమాలు హిట్ అవ్వడం.. ఫట్ అవ్వడం అనేది కథలు.. కథలో ఉండే కంటెంట్ ను బట్టి ఉంటుందనుకోండి. మంచి టాక్ వస్తే చాలు సినిమా హిట్ అయినట్టే. కొద్ది రోజులు థియేటర్ లో ఆడినట్టే. ఒకవేళ ఫట్ అయితే రెండు మూడు రోజులకే థియేటర్ నుండి ప్యాక్ అప్ చెప్పాల్సిన పరిస్థితి. నిజానికి ఇప్పుడు ఆన్ లైన్ సైట్స్ రాజ్యమేలుతున్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా, హిట్ సినిమా? ప్లాప్ సినిమా? అని లేదు రిలే అయిన కొద్దిరోజులకు ఆన్ లైన్ సైట్ లలో దర్శనమివ్వాల్సిందే. అందుకే ఇప్పుడు ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ పై కన్నేస్తున్నారు. రాబోయే భవిష్యత్తు కూడా దీనిపైనే ఉండటం…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News,Guna 369 And Rakshasudu 1st day collections, Guna 369 Collections, Guna 369 first day collections, Guna 369 Movie Updates, Latest Telugu Film News, Telugu Filmnagar, BellamKnoda Srinivas Rakshasudu Movie Collections, Raks
బాక్సాఫీస్

గుణ 369, రాక్షసుడు మూవీ కలెక్షన్స్

ఒకపక్క బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మరో పక్క కార్తికేయ.. ఇద్దరికీ హిట్ చాలా అవసరం. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరి సినిమాలు గుణ 369, రాక్షసుడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండుకు సినిమాలకు మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా సాయి కి మొదటిసారి ఓ మంచి హిట్ దక్కింది. మరి ఈ రెండు సినిమాలా వైజాగ్ కలెక్షన్స్ ఎలా వున్నాయి.. ఏయే ఏరియా లో ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.

TFN Adminవాట్సాప్
సొంత కుంపటినే నమ్ముకుంటున్న మన హీరోలు
సినిమా వార్తలు

సొంత కుంపటినే నమ్ముకుంటున్న మన హీరోలు

ఒకప్పుడు డైరెక్టర్ సినిమా డైరెక్ట్ చేసేవాడు, హీరో నటించేవాడు, ప్రొడ్యూసర్ సినిమాని నిర్మించేవాడు. అయితే అప్పుడప్పుడు హీరోహీరోయిన్లు మెగా ఫోన్ పట్టుకునేవాళ్ళు. తమ సినిమాలు తాము నిర్మించుకునేవాళ్ళు. కానీ ఆ సంప్రదాయం తక్కువగానే ఉండేది. అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి సినీ పరిశ్రమలో. ఇప్పుడున్న యంగ్ హీరోలు మాత్రం ఒకటి రెండు సినిమాలకే సొంత ప్రొడక్షన్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంతమంది హీరో లు తమ సినిమాలు తామే నిర్మించుకుంటున్నారు. సినిమా హిట్ అయిందంటే హీరోలకి కాసుల వర్షమే. మరి అలా మన యంగ్ హీరోలు ఎవరు తమ ప్రొడక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నారో చూద్దాం.

TFN Adminవాట్సాప్
Vangaveeti Look from Devineni Revealed,Telugu Filmnagar,Latest Telugu Film News,Telugu Movies News 2019,Tollywood Cinema Updates,Devineni Movie Updates,Devineni Telugu Movie Updates,#Devineni,Vangaveeti Look from Devineni Movie,Vangaveeti Look from D
సినిమా వార్తలు

వంగ‌వీటి రంగా జ‌యంతి కానుక‌గా... `దేవినేని` చిత్రం నుంచి `వంగ‌వీటి` లుక్

ఒక కులం అండ‌తో నాయ‌కుడైనా .. ప్ర‌త్య‌ర్థి సామాజిక వ‌ర్గం యువ‌తిని పెళ్లాడి.. ప్ర‌త్య‌ర్థి కులాల పేద‌ల్ని ఆదుకుని.. ఏ ఒక్క కులానికో ప‌రిమితం కాని నాయ‌కుడ‌య్యాడు వంగ‌వీటి రంగా. పేద‌- బ‌డుగు-బ‌ల‌హీన వ‌ర్గాల ఆరాధ్య దైవంగా అవ‌త‌రించాడు. ఒక రకంగా అత‌డు కాపు క‌మ్యూనిటీ నుంచి పుట్టుకొచ్చిన‌ రాబిన్ హుడ్ అని చ‌రిత్ర చెబుతోంది. బెజ‌వాడ రాజ‌కీయాల్లో సుదీర్ఘ ప్ర‌స్థానం సాగించిన మేటి నాయ‌కుడిగా వంగ‌వీటి రంగా (జూలై 4 జ‌న‌నం- 26 డిసెంబ‌ర్ మ‌ర‌ణం) ప్ర‌స్థానం ఎంతో గొప్ప‌ది. బెజ‌వాడ రౌడీ రాజకీయాల్లో అత‌డి హ‌త్య పేద‌ల గుండెల్ని మ‌రిగించింది. వంగ‌వీటి రంగాకు ధీటైన వ‌ర్గంగా బెజ‌వాడ రాజ‌కీయాల్లో ఎదిగిన దేవినేని…

TFN Adminవాట్సాప్

షేర్