జయలలిత బయోపిక్ – అన్ని ప్రశ్నలకు సమాధానం

New Update On Jayalalithaa Biopic The Iron Lady

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ను ఇప్పటీకే తెరకెక్కించడానికి పలువురు డైరెక్టర్స్ లైన్ లో వున్న సంగతి తెలిసిందే. అందులో ప్రియదర్శిని దర్శకత్వంలో నిత్యామీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ది ఐరన్ లేడీ’ ఒకటి. ఇక ఈ సినిమా తెరకెక్కుతున్నా అప్పుడెప్పుడో ఫస్ట్ లుక్ అంటూ ఒక్క పోస్టర్ ను రిలీజ్ చేశారు తప్పా ఇప్పటివరకూ పెద్దగా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా లేదన్న నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించడంతో.. నిత్యా మీనన్ గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చింది. సినిమా స్క్రిప్ట్ పనులు దాదాపు ఎండింగ్ కి వచ్చేశాయని.. దాదాపు అన్ని నిజాలే కథలో కనిపిస్తాయని చెప్పింది. అదే విధంగా రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి దర్శకుడు ప్రియదర్శి అలాగే మిగతా టెక్నీషియన్స్ రెడీ అవుతున్నారని క్లారిటీ ఇచ్చింది. ఇక తాజాగా ఈ బయోపిక్ పై మరోసారి స్పందించి తన ట్విట్టర్ ద్వారా ఓ నోట్ పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చింది నిత్యా .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 7 =