ట్యాగ్ · 45 కథనాలు
తేజు జోక్ చేసాడు.. మీరు సీరియస్‌గా తీసుకున్నారు

RECAP..ఈవారం టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్

త్వరలో సెట్స్ పైకి 'అ 2'..!
మళ్ళీ రైటర్ గా పవన్ కళ్యాణ్ ?

బన్నీ-సుకుమార్ టైటిల్ అన్నీ రూమర్లే..!

#VD 10 షూటింగ్ ప్రారంభం

"డిస్కో రాజా" సీక్వెల్ అవకాశం ఉంది - రవితేజ
విజయ్ దేవరకొండకి జోడీగా అనన్య పాండే?
వారం గ్యాప్ లో పాయల్, అనుష్క ప్రయోగాలు
బన్నీ, సుక్కు.. ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్
`అసురన్` రీమేక్ రెగ్యులర్ షూటింగ్ అప్ డేట్
అల్లరి నరేష్ కొత్త ఇమేజ్ కు "నాంది"
'ఒరేయ్ బుజ్జిగా' షూటింగ్ పూర్తి - రిలీజ్ డేట్ ఫిక్స్..!

#PRABHAS20 పై కృష్ణంరాజు అప్ డేట్

" బాక్సర్" కు జోడీ గా కియారా అద్వానీ ?
నక్సలైట్ ట్రైనింగ్ లో సాయి పల్లవి
అసలు ఎవరు ఈ జయదేవ్?
గంటా శ్రీనివాస్ రావు తనయుడు గంటా రవి హీరో గా తెలుగు తెరకు పరిచయమైన సినిమా "జయదేవ్". తమిళ్ లో సూపర్ హిట్ అయిన సేతుపతి సినిమాకు రీమేక్ ఇది. జయంత్ C పరాంజీ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై అశోక్ కుమార్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా 2017 రిలీజై మంచి టాక్ నే సొంతం చేసుకుంది.
తేజు జోక్ చేసాడు.. మీరు సీరియస్‌గా తీసుకున్నారు
కరోనా వల్ల టాలీవుడ్ కు సినిమాలకు కలిసి రాలేదు కానీ.. పెళ్లిళ్లకు మాత్రం బాగానే కలిసొచ్చిందని చెప్పొచ్చు. వరుసగా ఒకరి తర్వాత ఒకరి పెళ్లిళ్లు జరుగుతూనే వచ్చాయి. టాలీవుడ్ యంగ్ హీరోలు రానా, నిఖిల్, నితిన్ ఇటీవల టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. రీసెంట్ గా మెగా నిహారిక ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ పెళ్లిళ్లు జరిగాయి. ఇక దీనితో ప్రస్తుతం ఫోకస్ మొత్తం టాలీవుడ్ లో ఉన్న బ్యాచిలర్స్ పై పడింది.

RECAP..ఈవారం టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్
‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా జాయిన్ అవుతుంది. ఆ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరో కాదు నివేదా పేతురాజ్. నివేదా పేతురాజ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లో ఆమె కూడా పాల్గొందని తెలుస్తుంది.

త్వరలో సెట్స్ పైకి 'అ 2'..!
వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని నిర్మాతగా . ప్రశాంత్ వర్మని దర్శకుడిగా పరిచయం చేస్తూ వచ్చిన సినిమా ‘అ’. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బా, రెజీనా ప్రధాన పాత్రల్లో 2018 లో రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఓ కొత్త సినిమా చూశామన్న అనుభూతి ప్రేక్షకులకు కలిగింది. పలు అవార్డులను సైతం దక్కించుకుంది ఈ సినిమా.
మళ్ళీ రైటర్ గా పవన్ కళ్యాణ్ ?
మల్టీ ట్యాలెంటెడ్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ తోనే కాకుండా చిత్ర పరిశ్రమలో పలు విభాగాలలో తన ప్రతిభను కనపరిచారు . "జానీ "మూవీ కి స్టోరీ , స్క్రీన్ ప్లే సమకూర్చి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించారు. "సర్దార్ గబ్బర్ సింగ్ " మూవీ కి స్టోరీ , స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్ అందించారు. మెగా స్టార్ చిరంజీవి నటించిన "డాడీ " మూవీ లో ఒక ఫైట్ సీన్ ను పవన్ కళ్యాణ్ కంపోజ్ చేశారు . "అత్తారింటికి దారేది ", "అజ్ఞాతవాసి " మూవీస్ కు పవన్ కళ్యాణ్ గాయకుడు గా మారారు. "జనసేన "పొలిటికల్ పార్టీ స్థాపించి సినిమాలకు దూరం అయ్యారు.

బన్నీ-సుకుమార్ టైటిల్ అన్నీ రూమర్లే..!
స్టార్ హీరో.. స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా మొదలవుతుందంటే.. ఇక ఆ సినిమాకు సంబంధించిన పలు రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇది ఎప్పటినుండో చూస్తూనే వున్నాం. ఇక ఈసారి ఆ రూమర్లకు బుక్ అయిన సినిమా ఏంటంటే.. బన్నీ-సుకుమార్ సినిమా.

#VD 10 షూటింగ్ ప్రారంభం
ధర్మా ప్రొడక్షన్స్ సమర్పణ లో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడు గా యాక్షన్ ఎంటర్ టైనర్ #VD 10 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ ఫైటర్ గా నటిస్తున్న ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. #VD 10 మూవీ హిందీ తో పాటు దక్షిణాది భాషలలో రిలీజ్ కానుంది.

"డిస్కో రాజా" సీక్వెల్ అవకాశం ఉంది - రవితేజ
ఎస్ ఆర్ టి క్రియేషన్స్ బ్యానర్ పై "ఎక్కడికి పోతావు చిన్నవాడా " మూవీ ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా సైన్స్ ఫిక్షన్ మూవీ "డిస్కో రాజా" జనవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. నభా నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్యా కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
విజయ్ దేవరకొండకి జోడీగా అనన్య పాండే?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, `ఇస్మార్ట్` డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ స్పోర్ట్స్ డ్రామా రానున్న సంగతి తెలిసిందే. `ఫైటర్` పేరుతో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజయ్ బాక్సర్ గా దర్శనమివ్వనున్నాడు. పాన్ - ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ సోమవారం (జనవరి 20) నుండి ప్రారంభం కానుంది.
వారం గ్యాప్ లో పాయల్, అనుష్క ప్రయోగాలు
ఒకవైపు సంక్రాంతి సినిమాల హవా సాగుతూ ఉండగానే... మరో వైపు జనవరి ద్వితీయార్ధంలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ థియేటర్లలో సందడి చేయడానికి సిద్దమవుతున్నాయి. ఆ చిత్రాలే.. `డిస్కో రాజా`, `నిశ్శబ్దం`. సైంటిఫిక్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన `డిస్కో రాజా` ఈ నెల 24న రిలీజ్ కానుండగా... థ్రిల్లర్ మూవీగా రూపొందిన `నిశ్శబ్దం`.
బన్నీ, సుక్కు.. ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్
గత చిత్రం `రంగస్థలం`తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్. రెండేళ్ళ విరామం అనంతరం.. ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. `ఆర్య`, `ఆర్య 2` తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సుకుమార్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. కాగా, ఫిబ్రవరి మొదటి వారం నుండి రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది.
`ఆర్ ఆర్ ఆర్` తేదికి బాలయ్య - బోయపాటి చిత్రం?
`సింహా`, `లెజెండ్` తరువాత నటసింహా నందమూరి బాలకృష్ణ, మాస్ ఎంటర్ టైనర్స్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్.. ఇప్పటికే పూజ జరుపుకుంది. కాగా, రెగ్యులర్ షూటింగ్ ని ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టనున్నారని తెలిసింది.
`అసురన్` రీమేక్ రెగ్యులర్ షూటింగ్ అప్ డేట్
తమిళనాట వసూళ్ళ వర్షం కురిపించిన `అసురన్`ని.. తెలుగులో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా పునర్నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మాతృక నిర్మాత కలైపులి ఎస్. థానుతో కలసి డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో వెంకీకి జోడీగా ప్రియమణి నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది.
అల్లరి నరేష్ కొత్త ఇమేజ్ కు "నాంది"
కితకితలు, అత్తిలి సత్తిబాబు ఎల్ కె జి , సీమ శాస్త్రి, బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి, బెట్టింగ్ బంగార్రాజు, సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కామెడీ హీరో అల్లరి నరేష్ ఇప్పుడు ఒక కొత్త ఇమేజ్ కు "నాంది" పలికారు. దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మాణ సారథ్యంలో ఎస్ వి 2 ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నూతన దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "నాంది" మూవీ రూపొందనుంది.
'ఒరేయ్ బుజ్జిగా' షూటింగ్ పూర్తి - రిలీజ్ డేట్ ఫిక్స్..!
యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘ఒరేయ్.. బుజ్జిగా’. గతకొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ తాజాగా కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 3 న విడుదల చేయనున్నట్టు తెలిపారు.

#PRABHAS20 పై కృష్ణంరాజు అప్ డేట్
‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియన్ సినిమాగా.. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. గతకొద్ది కాలంగా గ్యాప్ తీసుకున్న ప్రభాస్ మళ్ళీ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. నిన్ననే తాను షూటింగ్ లో పాల్గొన్నట్టు అప్డేట్ కూడా ఇచ్చాడు. ఇక ఈ చిత్రం కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక ప్రేత్యేక సెట్‌ను నిర్మించారు. అందులో ఓ గీతాన్ని చిత్రీకరించనున్నారు. ఇక తాజాగా ఈ సినిమాపై కృష్ణంరాజు కూడా అప్ డేట్ ఇచ్చారు.

100 కోట్ల షేర్ రాబట్టిన 'అల వైకుంఠపురములో'
త్రివిక్రమ్‌తో ముచ్చటగా మూడోసారి జత కట్టి అల్లు అర్జున్ ఈసారి కేరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. మొత్తానికి లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీకి ఈ సినిమా మంచి రిలీఫె ఇచ్చింది. అటు క్లాస్, ఇటు మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించుకుంటున్న ఈ సినిమాకి ఫస్ట్ రోజు లానే ప్రతి రోజూ బాక్స్ ఆఫీస్ షేక్ చేసే రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయి. రిలీజ్ అయి దాదాపు వారం రోజులు కావస్తున్నా అల వైకుంఠపురములో కలెక్షన్స్ అదే గ్రాఫ్‌ను మెయింటెన్ చేస్తూ వస్తుంది. విడుదలైన నాలుగు రోజులకే నాన్ బాహుబలి రికార్డులను సైతం దాటేసింది. ఇక వారం రోజుల్లో ఈ సినిమా…
బిగ్ బాస్ లో నవ్వులు పూయించిన రియల్ బిగ్ బాస్
మెగాస్టార్ చిరంజీవి.... ఈ పేరు వింటే అందరిలోనూ పెద్దరికం, హుందాతనం, నిండుతనం మూర్తీభవించిన ఒక మెగా ఫిగర్ కళ్ళముందు కదులాడుతుంది. అయితే అలాంటి మెగా ఫిగర్ లో నిన్న రాత్రి ఒక డిఫరెంట్ డైమెన్షన్ను చూసి అందరూ ఆనందంగా నవ్వుకున్నారు. వంద రోజులకు పైగా ప్రేక్షకులను అలరించి ఆఖరి దశకు చేరుకున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఫైనల్స్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ షోలో ప్రదర్శించిన స్పాంటినిటీని, సెన్సాఫ్ హ్యూమర్ ను చూసి ఆశ్చర్య పోవటం జనం వంతయింది. తను నటించిన 151 సినిమాలలో 90 శాతం సినిమాలు డేరింగ్, డాషింగ్ అండ్ సీరియస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడుకున్నవే కావటంతో చిరంజీవి పట్ల జనంలో కూడా సీరియస్…

" బాక్సర్" కు జోడీ గా కియారా అద్వానీ ?
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైసెన్స్ పిక్చర్స్, బ్లు వాటర్స్ క్రియేటివ్స్ బ్యానర్స్ పై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా #VT 10 మూవీ అక్టోబర్ 10వ తేదీ పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నారు. బాక్సింగ్ లో వరుణ్ తేజ్ ట్రైనింగ్ తీసుకొంటున్నారు.
నక్సలైట్ ట్రైనింగ్ లో సాయి పల్లవి
సురేష్ ప్రొడక్షన్స్, SLV సినిమాస్ బ్యానర్స్ పై వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా 1990 ల నాటి సామా జిక పరిస్థితుల ఆధారంగా విరాటపర్వం 1992 మూవీ రూపొందుతుంది. హీరో రానా పోలీస్ ఆఫీసర్, సాయి పల్లవి నక్సలైట్ గా మారే గాయని పాత్రలో నటిస్తున్నారు. నందితా దాస్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ గా నటిస్తుండగా, జరీనా వహాబ్, ప్రియమణి, ఈశ్వరీ రావు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.