
ట్యాగ్ · 31 కథనాలు


మ్యాడ్ టీజర్ రిలీజ్

సర్కారు నౌకరి టీజర్ రిలీజ్

సలార్ టీజర్ రిలీజ్

మీకు నచ్చిన మాసీ టీజర్?
బ్రో టీజర్ రిలీజ్

కీడా కోలా టీజర్ రిలీజ్

భోళా శంకర్ టీజర్ రిలీజ్

కంగనా ఎమర్జెన్సీ టీజర్ రిలీజ్

నెక్ట్స్ లెవల్లో యానిమల్ ప్రీ టీజర్

భగవంత్ కేసరి టీజర్ రిలీజ్

రంగబలి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సత్యదేవ్ ఫుల్ బాటిల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సిద్ధార్ద్ టక్కర్ టీజర్ రిలీజ్

రిలీజ్ అయిన అథర్వ మూవీ టీజర్

ఎమోషనల్ రైడ్ గా రంగమార్తాండ టీజర్

సాయి తేజ్ విరూపాక్ష టీజర్ రిలీజ్

రావణాసుర టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

వీర సింహారెడ్డి మూవీ ని మిస్ కావద్దు - బాలకృష్ణ

ఓజీ గ్లింప్స్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ గ్లింప్స్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది.ఈరోజు పవన్ బర్త్ డే సందర్భంగా ఈటీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.100 సెకండ్ల రన్ టైంతో వచ్చిన ఈ గ్లింప్స్ హైప్ కు ఏమాత్రం తగ్గకుండా వుంది.గ్లింప్స్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ గా పవన్ రూత్ లెస్ గ్యాంగ్ స్టర్ గా కనిపించాడు.గ్లింప్స్ లో పవన్ లుక్,తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యింది.పవన్ ను ఇంతకుముందు ఎప్పుడూ చూపించని విధంగా చూపిస్తున్నాడు డైరెక్టర్ సుజీత్.

మ్యాడ్ టీజర్ రిలీజ్
నార్నె నితిన్,సంగీత్ శోభన్,రామ్ నితిన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం మ్యాడ్. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఈసినిమా టీజర్ ను ఈరోజు విడుదలచేశారు.ఇక ఈటీజర్ హిలేరియస్ గా వుంది.కాలేజ్ లో జరిగే గొడవలు,లవ్ స్టోరీ లు,ర్యాగింగ్ వంటి అంశాలను బేస్ చేసుకొని వస్తుంది ఈసినిమా.హ్యాపీ డేస్ టైపు సినిమా అనుకోవచ్చు.టీజర్ మాత్రం ప్రామిసింగ్ గా ఉంది.ఇలాంటి సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.పైగా సితార ఎంటెర్టైమెంట్స్ నుండి వస్తున్న సినిమా కావడం తో క్వాలిటీ విషయంలో డోకా ఉండదు.ఓవరాల్ గా టీజర్ తో హైప్ ను క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

సర్కారు నౌకరి టీజర్ రిలీజ్
సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సునీత. ఇక ఇప్పుడు ఆమె వారసత్వంతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు ఆకాష్ గోపరాజు. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సర్కారు నౌకరి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈసినిమా. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఈసినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో మంచి కంటెంట్ తో రాబోతుందని…

సలార్ టీజర్ రిలీజ్
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ టీజర్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది.ఇక ఈ టీజర్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వుంది.ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్ తో టీజర్ ను నింపేశారు. అయితే ఈటీజర్ లో మాత్రం ప్రభాస్ లుక్ ను పూర్తిగా రివీల్ చేయలేదు కానీ సినిమా ఎలా వుండబోతుందో అని ప్రశాంత్ నీల్ చెప్పేశాడు.ఈటీజర్ వ్యూస్ విషయంలో కొత్త రికార్డులు క్రీయేట్ చేయనుంది.మొత్తానికి సలార్ టీజర్ ఫ్యాన్స్ ను పూర్తి స్థాయిలో సంతృప్తిపరిచింది.

మీకు నచ్చిన మాసీ టీజర్?
సమ్మర్ సీజన్ కూడా ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటివరకూ పలు సినిమాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇక రిలీజ్ కు పలు సినిమాలు సిద్దంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ లైన్ లో ఉన్నాయి. వాటిలో అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ నటిస్తున్న భోళాశంకర్ ఇంకా భగవంత్ కేసరి సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో అలానే బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. ఇప్పుడు భోళా శంకర్, భగవంత్ కేసరి సినిమాలతో వచ్చేస్తున్నారు. మరవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న హ్యాట్రిక్…
బ్రో టీజర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది.ఎప్పటినుండో ఎదురుచూస్తున్న బ్రో టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ కు సూపర్ రెస్పాన్స్ రాగ ఇక ఈ టీజర్ కూడా చాలా ఇంట్రస్టింగ్ వుంది.1:27 నిమిషాల టీజర్ లో పవన్ చెప్పిన డైలాగ్స్ తోపాటు పవన్ స్టైలిష్ మేక్ ఓవర్ హైలైట్ అయ్యాయి.మొత్తానికి టీజర్ తో సూపర్ హైప్ తెచ్చారు మేకర్స్.ఇక ఈటీజర్ యు ట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.

కీడా కోలా టీజర్ రిలీజ్
యంగ్ అండ్ టాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. 2018 లో ఈనగరానికి ఏమైంది సినిమా వచ్చింది. ఆతర్వాత తరుణ్ భాస్కర్ నుండి కొత్త సినిమా ఏం రాలేదు. మధ్యలో నటుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇప్పుడైతే సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా' ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

భోళా శంకర్ టీజర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం భోళా శంకర్. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తమిళ బ్లాక్ బాస్టర్ మూవీ వేదాలంకు రీమేక్ తెరకెక్కుతున్న ఈసినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు.చాలా గ్యాప్ తరువాత తను డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. ఈసినిమానుండి విడుదలైన మొదటి సాంగ్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక కొద్దిసేపటి క్రితం ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈటీజర్ ను ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా కట్ చేశారు. టీజర్ లో చిరు లుక్ హైలైట్ అయ్యింది.చాలా యాక్టీవ్ గా కనిపించాడు. తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు చెప్పాడు.మొత్తానికి టీజర్ అయితే ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.

కంగనా ఎమర్జెన్సీ టీజర్ రిలీజ్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో, సినిమాలతో బాలీవుడ్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. ఈమధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఎక్కువ దృష్టి సారించింది కంగనా. ఝాన్సీ లక్ష్మీభాయి, తలైవి ఇలా పవర్ ఫుల్ పాత్రల్లో నటించింది కంగనా రనౌత్. ఇప్పుడు మరో పవర్ ఫుల్ లేడీ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ రిలీజ్ కు సిద్దమవుతుంది. కంగనాా స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఎమర్జెన్సీ. అత్యంత శక్తివంతమైన మహిళా ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ పాత్రలో ఈసినిమాలో నటిస్తుంది. ఎమర్జెన్సీ సమయంలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

నెక్ట్స్ లెవల్లో యానిమల్ ప్రీ టీజర్
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ వంగా. ఇక ఈసినిమా తరువాత హిందీలో కూడా అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. అక్కడ కూడా ఆసినిమా సంచలన విజయం సాధించింది. అంతేకాదు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టుకుంది. ఆ సినిమా తరువాత అక్కడే బాలీవుడ్ లోనే రణ్ బీర్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు సందీప్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాా యానిమల్. ఇప్పటి వరకూ లవర్ బాయ్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించిన రణ్‌బీర్ కపూర్ ఈసినిమాలో మాత్రం తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే రణ్ బీర్ ఎంత వయోలెంట్ గా ఉండబోతున్నాడో…

భగవంత్ కేసరి టీజర్ రిలీజ్
బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా భగవంత్ కేసరి.ఐ డోంట్ కేర్ ట్యాగ్ లైన్.రీసెంట్ గా రిలీజైన టైటిల్,ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక కొద్దీ సేపటి క్రితం ఈసినిమా టీజర్ కూడా విడుదలైంది.ఈరోజు బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఈటీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.ఈటీజర్ కూడా ఇంట్రెస్టింగ్ గా వుంది.బాలయ్య మార్క్ యాక్షన్ సీన్స్,డైలాగ్స్ తో ఈటీజర్ ను కట్ చేశారు.తెలంగాణ స్లాంగ్ లో బాలయ్య చెప్పిన డైలాగ్స్,థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లో హైలైట్ అయ్యాయి.ఓవరాల్ గా ఈటీజర్, సినిమాఫై అంచనాలను మరింతగా పెంచింది.

రంగబలి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో నాగశౌర్య కూడా ఇప్పుడు తన రూట్ ను మార్చి డిఫరెంట్ కథలను చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందుకే హిట్స్ ఫ్లాప్స్ ను పట్టించుకోకుండా ప్రయోగాలు చేయడానికే ముందుకొస్తున్నాడు. ప్రస్తుతం అయితే నాగశౌర్య మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగబలి. పల్లెటూరి నేపథ్యంలో ఈసినిమా ఉండబోతుందని ఈసినిమా గ్లింప్స్ ను బట్టి అర్థమయింది.

సత్యదేవ్ ఫుల్ బాటిల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి మరీ నటించే నటుల్లో టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కూడా ఎప్పుడూ ముందుంటాడు. ఒక పక్క హీరో పాత్రలు చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతున్నాడు. ఈనేపథ్యంలో ఫుల్ బాటిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది.

సిద్ధార్ద్ టక్కర్ టీజర్ రిలీజ్
'బోయ్స్', 'బొమ్మరిల్లు', ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’,'ఓయ్' ఇలా తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నాడు సిద్ధార్థ్. ఇక ప్రస్తుతం వున్న పోటీ వాతావరణంలో కాస్త వెనకబడిపోయాడు. అప్పుడప్పుడు ఒక్కో సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగానే ఉన్నాడు. ఇక నేడు సిద్దార్థ్ పుట్టినరోజు కావడంతో తన సినిమాల నుండి అప్ డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఇండియన్ 2 నుండి బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా తను ప్రధాన పాత్రలో చేస్తున్న టక్కర్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

రిలీజ్ అయిన అథర్వ మూవీ టీజర్
నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేష్ రెడ్డి దర్శకత్వంలో యువ హీరో కార్తీక్ రాజు హీరోగా క్రైమ్ థ్రిల్లర్ అథర్వ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో సిమ్రాన్ చౌదరి, ఐరా కథానాయికలు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. అతి త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఎమోషనల్ రైడ్ గా రంగమార్తాండ టీజర్
టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం నానా పాటేకర్ హీరోగా నటించిన మరాఠీ మూవీ ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఈసినిమా నుండి ఇప్పటివరకూ రిలీజ్ అయిన పోస్టర్లు, అలానే పాటలు సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. దానికి తోడు రీసెంట్ గానే టాలీవుడ్ సెలబ్రిటీలు కొంతమందికి ప్రీమియర్ షో నిర్వహించాడు కృష్ణవంశీ. ఇక సినిమా చూసిన వారందరూ సినిమాపై ప్రశంసలు కురిపించారు. సింగర్ సునీత కూడా తన సోషల్ మీడియా ద్వారా సినిమాపై, కృష్ణవంశీపై…

రావణాసుర టీజర్ రిలీజ్ - పవర్ ఫుల్ మాస్ అవతార్ లో రవితేజ
మాస్ మహారాజా రవితేజ మాత్రం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ నుండి వస్తున్న సినిమా రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇక ఇప్పటివరకూ రిలీజ్ అయిన పోస్టర్లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా రావణాసుర టైటింగ్ సాంగ్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

సాయి తేజ్ విరూపాక్ష టీజర్ రిలీజ్
మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తన సినిమాలతో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి తేజ్. గత ఏడాది రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి తేజ్ ప్రస్తుతం మరో థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా విరూపాక్ష సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

రావణాసుర టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ మాత్రం సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేసాడు. ఇక ఈఏడాది అప్పుడే వాల్తేరు వీరయ్య, ధమాకా సినిమాలతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా రావణాసుర. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర'. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

వీర సింహారెడ్డి మూవీ ని మిస్ కావద్దు - బాలకృష్ణ
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. భారీ కలెక్షన్స్ సాధించిన ఈమూవీ బాలకృష్ణ సినీ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈమూవీ ఫిబ్రవరి 23వ తేదీ నుండి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్…