సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సునీత. ఇక ఇప్పుడు ఆమె వారసత్వంతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు ఆకాష్ గోపరాజు. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సర్కారు నౌకరి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈసినిమా. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఈసినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో మంచి కంటెంట్ తో రాబోతుందని అర్థమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ .టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. 1996 లో కొల్లాపూర్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఆరోజుల్లో ప్రభుత్వ ఉద్యోగి అంటే ఎంత విలువ ఉండేదోో కూడా ఈసినిమా ద్వారా చూపించారు. ఇక ఈసినిమాలో న్యాచురల్ గా ఉన్న విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటున్నాయి. చూడబోతే ఆకాష్ ఈసినిమాతో మంచి హిట్ నే కొట్టేలా కనిపిస్తున్నాడు.
కాగా ఈసినిమాను లెజెండరీ డైరెక్టర్ కే.రాఘవేంద్రరావు ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆకాశ్‌కు జోడీగా భావనా వళపండల్ నటిస్తోంది. ఇంకా ఈసినిమాలో తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ ఇతర పాత్రల్లో కనిపించనుననారు. శాండిల్య సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కూడా గంగనమోని శేఖర్ పనిచేస్తుండటం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: