టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో నాగశౌర్య కూడా ఇప్పుడు తన రూట్ ను మార్చి డిఫరెంట్ కథలను చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందుకే హిట్స్ ఫ్లాప్స్ ను పట్టించుకోకుండా ప్రయోగాలు చేయడానికే ముందుకొస్తున్నాడు. ప్రస్తుతం అయితే నాగశౌర్య మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగబలి. పల్లెటూరి నేపథ్యంలో ఈసినిమా ఉండబోతుందని ఈసినిమా గ్లింప్స్ ను బట్టి అర్థమయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. జులై 7వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఇక ఇప్పుడు తాజాగా సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చేశారు. ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈసినిమాను జూన్ 8వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
కాగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ సీహెచ్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా దివాకర్ మణి పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: