‘బోయ్స్’, ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’,’ఓయ్’ ఇలా తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నాడు సిద్ధార్థ్. ఇక ప్రస్తుతం వున్న పోటీ వాతావరణంలో కాస్త వెనకబడిపోయాడు. అప్పుడప్పుడు ఒక్కో సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగానే ఉన్నాడు. ఇక నేడు సిద్దార్థ్ పుట్టినరోజు కావడంతో తన సినిమాల నుండి అప్ డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఇండియన్ 2 నుండి బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా తను ప్రధాన పాత్రలో చేస్తున్న టక్కర్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కార్తిక్ జి క్రిష్ దర్శకత్వంలో సిద్దార్ధ్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ‘టక్కర్’. ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. మహా సముద్రం తరువాత తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే ఆసక్తికరంగా ఉంది. యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసిన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
Get ready for the 𝐑𝐨𝐦𝐚𝐧𝐭𝐢𝐜 𝐀𝐜𝐭𝐢𝐨𝐧 𝐑𝐢𝐝𝐞♥️🚘
Here’s the teaser of #Siddharth‘s #Takkar
▶️ https://t.co/4GtP8RlIpUIn cinemas on May 26th
Directed by @Karthik_G_Krish@peoplemediafcy @AAArtsOfficial @PassionStudios_ @vishwaprasadtg @AbhishekOfficl @itsdivyanshak pic.twitter.com/LB09gYiy8x— People Media Factory (@peoplemediafcy) April 17, 2023
ఇంకా ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై సుధన్ సుందరం, జయరాం నిర్మిస్తున్న ఈసినిమాను తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్, టిజీ విశ్వప్రసాద్ రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. నివాస్ కె ప్రసన్న ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: