పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి మరీ నటించే నటుల్లో టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కూడా ఎప్పుడూ ముందుంటాడు. ఒక పక్క హీరో పాత్రలు చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతున్నాడు. ఈనేపథ్యంలో ఫుల్ బాటిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది. షూటింగ్ కూడా మొదలుపెట్టింది. అయితే చాలా రోజుల నుండి ఈసినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు చిత్రయూనిట్. ఈ సినిమా గురించి అందరూ మర్చిపోతున్న తరుణంలో తాజాగా ఒక సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చాడు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి ప్రిపరేషన్ వీడియో ను రిలీజ్ చేశారు. ఈ వీడియో మొత్తం పంచ్ లతో కామెడీ గా సాగింది. డైరెక్టర్ శరణ్, హీరో సత్యదేవ్ కి మెర్క్యూరీ పాత్రను వివరించిన విధానం వీడియో లో ఆకట్టుకుంటుంది. అంతేకాదు టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఈసినిమా టీజర్ ను మే 27వ తేదీన సాయంత్రం 5గంటల30 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: