
ట్యాగ్ · 31 కథనాలు · పేజీ 2


ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్ రిలీజ్

రిలీజ్ అయిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ టీజర్

అమిగోస్ టీజర్ రిలీజ్

'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ రిలీజ్..!

"జేమ్స్ "మూవీ తెలుగు టీజర్ రిలీజ్

'సెబాస్టియన్ పీసీ 524' టీజర్ రిలీజ్

'ఒకే ఒక జీవితం' టీజర్ రిలీజ్

"స్కైలాబ్"మూవీ టీజర్ రిలీజ్

'అర్జున ఫల్గుణ' టీజర్ రిలీజ్

'పక్కా కమర్షియల్' టీజర్ రిలీజ్

బెదురులంక 2012 టీజర్ రిలీజ్
టాలీవుడ్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈతరం హీరోల్లో యంగ్ హీరో కార్తికేయ కూడా ఒకరు. ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కార్తికేయ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆసినిమా తరువాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని హీరోగా నిలదొక్కుకోగలిగాడు. కేవలం హీరోగా మాత్రమే కాదు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడానికి కూడా ఏమాత్రం వెనుకాడకుండా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే కార్తికేయ నుండి వస్తున్న సినిమా బెదురులంక 2012. క్లాక్స్ దర్శకత్వంలో బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే నేపథ్యంలో ఈ మూవీ…

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్ రిలీజ్
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న హీరోల్లో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన నాగశౌర్య మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నాడు. ఈమధ్యనే కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు నాగశౌర్య. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వస్తున్న సినిమా ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి. ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా…

రిలీజ్ అయిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ టీజర్
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫిబ్రవరి 17వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీతో పాటు కిరణ్ అబ్బవరం హీరోగా పలు మూవీస్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

అమిగోస్ టీజర్ రిలీజ్
కళ్యాణ్ రామ్ మొత్తానికి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా అమిగోస్. ఇక బింబిసార సినిమాలో రెండు పాత్రలతో అలరించాడు కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు ఈసినిమాలో ఏకంగా మూడు పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అందులో ఒక పాత్ర నెగెటివ్ షేడ్ లో రెండు పాత్రలు కాస్త విభిన్నంగా ఉండేలా కనిపిస్తున్నాయి. కేవలం ఫస్ట్ లుక్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్.

'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ రిలీజ్..!
ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతి ఒక్క హీరో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఆ లిస్ట్ లో మాస్ మహారాజా రవితేజ కూడా ఉన్నాడు. అయితే రవితేజ మాత్రం కేవలం సినిమాల షూటింగ్ లలో మాత్రమే కాదు రిలీజ్ చేసే విషయంలో కూడా స్పీడుమీదున్నాడు. రీసెంట్ గానే ఖిలాడి తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు పలు సినిమాలు లిస్ట్ లో ఉండగా.. అందులో రామారావు ఆన్ డ్యూటీ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

"జేమ్స్ "మూవీ తెలుగు టీజర్ రిలీజ్
కిషోర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చేతన్ కుమార్ దర్శకత్వం లో దివంగత స్టార్ హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కథానాయకుడిగా తెరకెక్కిన "జేమ్స్ "కన్నడ మూవీ మార్చి 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రియా ఆనంద్ కథానాయిక . చరణ్ రాజ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ "జేమ్స్ "మూవీ ప్రమోషన్స్ ను ప్రారంభించింది.

'సెబాస్టియన్ పీసీ 524' టీజర్ రిలీజ్
ప్రస్తుతం టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న కుర్ర హీరోల్లో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. ఇప్పటికి కిరణ్ సినిమాలు రిలీజ్ అయింది రెండు సినిమాలు మాత్రమే కానీ వరుస అవకాశాలు.. పెద్ద పెద్ద బ్యానర్స్ లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఇక కిరణ్ లిస్ట్ లోచాలా సినిమాలు ఉండగా అందులో సెబాస్టియన్ పీసీ 524 సినిమా కూడా ఒకటి. కిరణ్ అబ్బవరం మొదటిసారి ఈ సినిమాలో పోలీస్ గా నటిస్తున్నాడు. ఈసినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు మేకర్స్.

'ఒకే ఒక జీవితం' టీజర్ రిలీజ్
యంగ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది రెండు సినిమాలతో అలరించాడు. ఈ ఏడాది ప్రధమార్థంలో శ్రీకారం సినిమాను రిలీజ్ చేయగా.. రీసెంట్ గానే మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ చేస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈసినిమాను చేస్తున్నాడు శర్వా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ కరోనా వల్ల చాలా ఆలస్యమైంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుండగా.. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్…

"స్కైలాబ్"మూవీ టీజర్ రిలీజ్
డాక్టర్ కె రవికిరణ్ సమర్పణలో బైట్ ఫీచర్స్ , నిత్య మీనన్ కంపెనీ బ్యానర్స్ పై విశ్వక్ కందేరావు దర్శకత్వంలో సత్యదేవ్ , నిత్య మీనన్ , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో స్కైలాబ్ ఆధారంగా తెరకెక్కిన పీరియాడికల్ మూవీ “స్కైలాబ్ “ డిసెంబర్ 4 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. NASA ఫస్ట్ స్పేస్ స్టేషన్ స్కైలాబ్ (1979) కూలిపోయి భూమి సర్వ నాశనం అయిపోతుందని వార్తలు రావడంతో ప్రజలంతా ఏం జరుగుతుందోనని ఆసక్తి గా ఎదురుచూసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రంలోని బండ లింగపల్లి గ్రామంలోని గౌరి, ఆనంద్, రామారావు జీవితాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే నేపథ్యం లో “స్కైలాబ్ ” మూవీని…

'అర్జున ఫల్గుణ' టీజర్ రిలీజ్
టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవల రాజ రాజ చోర సినిమాతో హిట్ అందుకున్నాడు శ్రీవిష్ణు. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. తేజ మర్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు అర్జున ఫల్గుణ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

'పక్కా కమర్షియల్' టీజర్ రిలీజ్
మొత్తానికి మారుతి చాలా తక్కువ బడ్జెట్ తో తక్కువ రోజుల్లో సినిమాలు తీసి హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. రీసెంట్ గా మంచి రోజులు వచ్చాయి సినిమాతో మరో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన ఈసినిమాలో దీపావళి రోజున విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా ను మారుతి కేవలం 30 రోజుల్లో పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు.