నార్నె నితిన్,సంగీత్ శోభన్,రామ్ నితిన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం మ్యాడ్. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఈసినిమా టీజర్ ను ఈరోజు విడుదలచేశారు.ఇక ఈటీజర్ హిలేరియస్ గా వుంది.కాలేజ్ లో జరిగే గొడవలు,లవ్ స్టోరీ లు,ర్యాగింగ్ వంటి అంశాలను బేస్ చేసుకొని వస్తుంది ఈసినిమా.హ్యాపీ డేస్ టైపు సినిమా అనుకోవచ్చు.టీజర్ మాత్రం ప్రామిసింగ్ గా ఉంది.ఇలాంటి సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.పైగా సితార ఎంటెర్టైమెంట్స్ నుండి వస్తున్న సినిమా కావడం తో క్వాలిటీ విషయంలో డోకా ఉండదు.ఓవరాల్ గా టీజర్ తో హైప్ ను క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాను కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా గౌరీ ప్రియా,అనంతిక,గోపిక ఉదయన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.మురళీధర్ గౌడ్,రఘు బాబు,విష్ణు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది.ఇక ఈసినిమాతో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ చెల్లెలు హారిక సూర్యదేవర నిర్మాత గా మారుతుంది.సాయి సౌజన్యతో కలిసి ఆమె ఈసినిమాను నిర్మిస్తుంది.ఈఏడాది చివర్లో మ్యాడ్ ను విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: