రావణాసుర టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Ravanasura Movie Teaser Release Date Fixed,Latest 2023 Telugu Movie,2023 Telugu Teasers,2023 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2023,2023 Latest Telugu Teasers,Latest Telugu Movies 2023,Telugu Filmnagar,New Telugu Movies 2023,Latest Movie Teaser,Ravanasurateaser,Ravanasura Movie Teaser,Ravanasura Telugu Movie Teaser,Ravanasura Telugu Teaser,Ravanasura Official Teaser,Ravanasura Movie Teaser Deliver,Ravanasura Movie Teaser Released,Movie Of Ravanasura Release Date Fixed,Ravi Teja,Ravanasura,Sudheer Varma,Bheems Ceciroleo,Harshavardhan Rameshwar

మాస్ మహారాజా రవితేజ మాత్రం సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేసాడు. ఇక ఈఏడాది అప్పుడే వాల్తేరు వీరయ్య, ధమాకా సినిమాలతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా రావణాసుర. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర’. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. టీజర్ ను మార్చి 6వ తేదీన ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రవితేజ ట్రెండీగా, క్రూయల్ లుక్ లో కనిపిస్తున్న ఇంటెన్స్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ అనౌన్సుమెంట్ చేశారు.

కాగా ఈసినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్‌ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్ గా, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రావణాసుర చిత్రాన్ని 2023 ఏప్రిల్‌ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 8 =