అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ వంగా. ఇక ఈసినిమా తరువాత హిందీలో కూడా అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. అక్కడ కూడా ఆసినిమా సంచలన విజయం సాధించింది. అంతేకాదు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టుకుంది. ఆ సినిమా తరువాత అక్కడే బాలీవుడ్ లోనే రణ్ బీర్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు సందీప్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాా యానిమల్. ఇప్పటి వరకూ లవర్ బాయ్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించిన రణ్‌బీర్ కపూర్ ఈసినిమాలో మాత్రం తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే రణ్ బీర్ ఎంత వయోలెంట్ గా ఉండబోతున్నాడో చూపించాడు సందీప్ రెడ్డి. గుబురు గడ్డంతో, రక్తం నిండిన బట్టలు, గొడ్డలితో క్రూరంగా కనిపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రీ టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ప్రీ టీజర్ మాత్రం చాలా పవర్ ఫుల్ గా భయంకరంగా ఉందని చెప్పొచ్చు. ముందుగా మాస్కులు వేసుకున్న కొందరు కనిపిస్తారు. ఆ తర్వాత ఓ పంజాబీ సాంగ్‌ను కొందరు పాడుతుంటారు. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో అప్పుడు హీరో రణ్‌బీర్ కపూర్ పంచెకట్టులో ఎంట్రీ ఇస్తాడు. మాస్కులు వేసుకున్న గ్రూప్‌ను గొడ్డలితో నరికేస్తాడు. 50 సెకన్ల నిడివి ఉన్న ప్రీ టీజరే ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అన్న ఆసక్తి పెరిగింది. మరి అది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: