కీడా కోలా టీజర్ రిలీజ్

Tarun Bhaskars Keeda Cola movie teaser out now

యంగ్ అండ్ టాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. 2018 లో ఈనగరానికి ఏమైంది సినిమా వచ్చింది. ఆతర్వాత తరుణ్ భాస్కర్ నుండి కొత్త సినిమా ఏం రాలేదు. మధ్యలో నటుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇప్పుడైతే సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్స్ ను రీసెంట్ గానే మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమాలో నటిస్తున్న కీలకపాత్రలకు సంబంధించిన పోస్టర్లను వరుసగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్ ఇంకా పలువురు పోస్టర్లను రిలీజ్ చేశారు. ఇక తాజాాగా ఈసినిమా టీజర్ కు సిద్దమయ్యారు. తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం. ఫన్ రైడర్ గా ఉన్న టీజర్ అయితే ఆకట్టుకుంటుంది.

బ్రహ్మానందం, చైతన్య కోలా బాటిల్‌ని అనుమానాస్పదంగా చూస్తున్న దృశ్యంతో టీజర్ ప్రారంభమైంది. ఏంట్రా అది అని బ్రహ్మానందం అంటే గ్రేప్స్ ఏమో అని అంటాడు చైతన్య. గ్రేప్సా.. ఎలా బతికావురా ఇన్నాళ్లు నువ్వు అని బ్రహ్మానందం అనగా దానికి నువ్వు.. నువ్వు బతుకుతలేవా.. అట్లనే అంటాడు చైతన్య. ఇక యాక్షన్ సీన్లు కూడా ఉన్నాయి. టీజర్ ను బట్టి తరుణ్ భాస్కర్ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు అర్థమవుతుంది. తరుణ్ భాస్కర్ మార్క్ కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. టీజర్ అయితే సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.

కాగా ఈసినిమాలో బ్రహ్మానందం కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాలో మొత్తంగా 8 ప్రధాన పాత్రలు ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కబోతోన్న ఈసినిమాను భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎజె ఆరోన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.