పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది.ఎప్పటినుండో ఎదురుచూస్తున్న బ్రో టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ కు సూపర్ రెస్పాన్స్ రాగ ఇక ఈ టీజర్ కూడా చాలా ఇంట్రస్టింగ్ వుంది.1:27 నిమిషాల టీజర్ లో పవన్ చెప్పిన డైలాగ్స్ తోపాటు పవన్ స్టైలిష్ మేక్ ఓవర్ హైలైట్ అయ్యాయి.మొత్తానికి టీజర్ తో సూపర్ హైప్ తెచ్చారు మేకర్స్.ఇక ఈటీజర్ యు ట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వినోదయం సీతంకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో పవన్ దేవుడి పాత్రలో కనిపించనుండగా సాయి తేజ్ మార్కండేయులు అనే పాత్రలో నటిస్తున్నాడు.కథ వీరిద్దరి చుట్టూనే తిరగనుంది.సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా ప్రియా ప్రకాష్ వారియర్,కేతిక శర్మ,బ్రహ్మజీ ,తణికెళ్ల భరణి ,రోహిణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.థమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ అంచనాల మధ్య వచ్చే నెల 28న బ్రో థియేటర్లోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: