ప్రస్తుతం నాగశౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న సినిమా లక్ష్య కూడా ఒకటి. రీసెంట్ గానే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే విడుదలై ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లోకూడా ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. సినిమాకు మంచి బజ్ రావాలంటే ఈమధ్య ప్రమోషన్ కార్యక్రమాల్లో కొత్త దనం చూపిస్తున్నారు మేకర్స్. ఇక లక్ష్య టీం ప్రతి శుక్రవారం ఒక అప్ డేట్ ఉంటుందని ఆ మధ్య ప్రతి శుక్రవాం ఒక పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా కాస్త వెరైటీగా ఆలోచించి నాలుగు రిలీజ్ డేట్ లు ఇచ్చి వాటిలో ఏ రోజు ఉంటుందో గెస్ చేయమని అడిగారు. అందులో అక్టోబర్ 15 వ తేదీ, అక్టోబర్ 22వ తేదీ, అక్టోబర్ 25వ తేదీ, నవంబర్ 12వ తేదీ ఉన్నాయి. ఇక ఫైనల్ గా నేడు ఈ సినిమాను నవంబర్ 12వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
పార్ధుడికి గురి మాత్రమే కనిపిస్తుంది🎯
Experience the Gaandiva sound of #Lakshya🏹 in Cinemas from Nov 12th! #LakshyaonNov12th@IamNagashaurya #KetikaSharma @IamJagguBhai @nseplofficial @Santhosshjagar1 @kaalabhairava7 @AsianSuniel @sharrath_marar @RaamDop @adityamusic pic.twitter.com/0Ha2bQ1WPd
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) September 27, 2021
కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి & నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కింద నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగశౌర్య పార్థూ అనే పాత్రలో నటిస్తున్నాడు. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: