గోపీకృష్ణా మూవీస్ సమర్పణ లో యువి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజేహెగ్దే జంటగా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్”, తెలుగు , హిందీ భాషలలో 3డి ఫార్మాట్ లో తెరకెక్కుతున్న “ఆది పురుష్“ , పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్టు K ” మూవీస్ సెట్స్ మీద ఉన్నాయి. హీరో ప్రభాస్ సిల్వర్ జూబ్లీ మూవీ అనౌన్స్ మెంట్ నిన్న జరిగిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టి సిరీస్ , యు వి క్రియేషన్స్ , భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి “మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో “స్పిరిట్ “మూవీ తెరకెక్కనుంది. “స్పిరిట్” సినిమా గురించి ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ”సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్న “స్పిరిట్” తో ప్రయాణం కిక్ స్టార్టింగ్” అని ప్రభాస్ తెలిపారు. ఈ మూవీ లో హీరో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారని సమాచారం. “స్పిరిట్” మూవీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, మండరిన్, జపనీస్, కొరియా భాషలలో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలోనే పాన్ వరల్డ్ స్టార్ గా మారనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: