గురుపవన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ఇదే మా కథ. టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక సినిమా కాన్సెప్ట్ టీజర్‌ను ఇటీవలే విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేయగా.. ఆ టీజర్‌కి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈసినిమా రిలీజ్ కు కూడా సిద్దమవుతుంది. నిజానికి ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల రిలీజ్ కు ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ చిత్రాన్ని గాంధీ జయంతి కానుకగా అక్టోబరు 2 నగ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. సప్తగిరి, పృథ్వీ, సమీర్, రామ్ ప్రసాద్, జోష్ రవి, తివిక్రమ్ సాయి, శ్రీకాంత్ అయ్యంగార్, మధుమణి, సంధ్య జనక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చూద్దాం మరి రైడర్స్ గా వస్తున్న ఈ సినిమా వారికి ఎంత బ్రేక్ ఇస్తుందో.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























