
ట్యాగ్ · 199 కథనాలు · పేజీ 5


'అద్భుతం' ట్రైలర్ రిలీజ్

ఆర్ జి వి " లడ్‌కీ " మూవీ ట్రైలర్ రిలీజ్

'అర్జున ఫల్గుణ' టీజర్ రిలీజ్

'పక్కా కమర్షియల్' టీజర్ రిలీజ్

అనుష్క 48 వ మూవీ అనౌన్స్ మెంట్

'డేగల బాబ్జీ' ట్రైలర్ రిలీజ్

క్లాసికల్ డ్యాన్సర్ గా నటించా - తాన్య రవిచంద్రన్

'స్కైలాబ్' ట్రైలర్ రిలీజ్

'సూపర్ మచ్చి' టీజర్ రిలీజ్

దుల్కర్ సల్మాన్ 'కురుప్' ట్రైలర్ రిలీజ్

"RRR" మూవీ గ్లింప్స్ పై స్టార్ హీరోల స్పందన

'రాజా విక్రమార్క' ట్రైలర్ రిలీజ్

"ఆశ ఎన్‌కౌంటర్"మూవీ ట్రైలర్ రిలీజ్

"అనుభవించు రాజా " మూవీ రిలీజ్ డేట్

'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
'పుష్పక విమానం' ట్రైలర్ రిలీజ్

'కురుప్' ట్రైలర్ లో ఉంది ఒక్క శాతమే
తమిళ్, మలయాళ సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుండటంతో మేకర్స్ కూడా తమ సినిమాలను ఇక్కడ రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా తన సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కురుప్. తెలుగులో కూడా ఈ నెల 12న విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. మరోవైపు తెలుగులో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.

'అద్భుతం' ట్రైలర్ రిలీజ్
మల్లిక్ రామ్ దర్శకుడిగా పరిచయమవుతూ... తేజ సజ్జా, శివాని హీరో, హీరోయిన్లుగా అద్భుతం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా ఎప్పుడో అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ రిలీజ్ అవ్వగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుందన్న విషయం అర్ధమయింది. అయితే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా, ఈ నెల 19వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఆర్ జి వి " లడ్‌కీ " మూవీ ట్రైలర్ రిలీజ్
ఆర్ట్‌సీ మీడియా, చైనీస్ ప్రొడక్షన్ మేజర్ బిగ్ పీపుల్ బ్యానర్స్ పై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో పూజా భలేకర్ ప్రధానపాత్రలో హాలీవుడ్ స్టార్ బ్రూస్ లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ స్ఫూర్తితో "లడ్‌కీ:ఎంటర్ ది గర్ల్ డ్రాగన్" హిందీ మూవీ తెరకెక్కుతుంది. మార్షల్ ఆర్ట్స్ హీరో బ్రూస్ లీ స్ఫూర్తితో ముందుకు సాగే యువతిగా పూజా భలేకర్ ఓ వైపు యాక్షన్ పార్టుతో అదరగొడుతూనే మరోవైపు అందాలను ఆరబోస్తుంది. "లడ్‌కీ:ఎంటర్ ది గర్ల్ డ్రాగన్" మూవీ హిందీతోపాటు చైనీస్ భాషలో విడుదల కానుంది.

'అర్జున ఫల్గుణ' టీజర్ రిలీజ్
టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవల రాజ రాజ చోర సినిమాతో హిట్ అందుకున్నాడు శ్రీవిష్ణు. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. తేజ మర్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు అర్జున ఫల్గుణ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

'పక్కా కమర్షియల్' టీజర్ రిలీజ్
మొత్తానికి మారుతి చాలా తక్కువ బడ్జెట్ తో తక్కువ రోజుల్లో సినిమాలు తీసి హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. రీసెంట్ గా మంచి రోజులు వచ్చాయి సినిమాతో మరో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన ఈసినిమాలో దీపావళి రోజున విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా ను మారుతి కేవలం 30 రోజుల్లో పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు.

అనుష్క 48 వ మూవీ అనౌన్స్ మెంట్
"సూపర్" మూవీ తో టాలీవుడ్ కు , "రెండు"మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కు అనుష్క పెట్టింది పేరుగా మారారు. "విక్రమార్కుడు", "అరుంధతి ", "వేదం", "బాహుబలి", "రుద్రమదేవి ", "భాగమతి " వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అనుష్క ఆకట్టుకున్నారు. పలు మూవీస్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. "నిశ్శబ్దం" మూవీ తరువాత అనుష్క మరే సినిమా అంగీకరించలేదు.

'డేగల బాబ్జీ' ట్రైలర్ రిలీజ్
గతంలో పలు సినిమాల్లో కామెడియన్ గా చేసిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తీసాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. తనకు రాజకీయాలు సెట్ కావని బయటకు వచ్చేశాడు. మళ్ళీ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో ‘డేగల బాబ్జీ’ అనే సినిమాతో వస్తున్నాడు. వెంకట్ చంద్ర దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. తమిళంలో పార్తీబన్ హీరోగా నటించిన ‘ఒత్తుసెరుప్పు సైజ్ 7’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.

క్లాసికల్ డ్యాన్సర్ గా నటించా - తాన్య రవిచంద్రన్
ఆదిరెడ్డి. టి సమర్పణలో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై శ్రీ సారిపల్లి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా “రాజావిక్రమార్క “మూవీ నవంబర్ 12వ తేదీ రిలీజ్ కానుంది. తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో సుధాకర్ కోమాకుల, సాయి కుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ , బక్రీద్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'రాధేశ్యామ్' క్లైమాక్స్ కోసం సంవత్సరం నుండి పని చేస్తున్నా..!
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధేశ్యామ్. యూరప్ నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నఈసినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. ప్రేరణ పాత్రలో పూజా నటిస్తుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల చాలా లేట్ అయింది. ఇక భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తున్న సినిమా కాబట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. కేవలం ఈ సినిమా క్లైమాక్స్ కోసమే దాదాపు ఏడాది నుండి వర్క్ చేస్తున్నారట. ఈవిషయాన్ని స్వయంగా ఈసినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన మనోజ్ పరమహంస తెలిపారు.

'స్కైలాబ్' ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గరనుండి ఇప్పుడు హీరోగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే మొత్తానికి వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇక రీసెంట్ గా తిమ్మరుసు సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సత్యదేవ్ ప్రస్తుతం తన ఖాతాలో ఉన్న సినిమాలను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. అందులో స్కైలాబ్ సినిమా కూడా ఉంది. విశ్వక్ కందేరావు దర్శకత్వంలో సత్యదేవ్ , నిత్య మీనన్ , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సినిమా స్కైలాబ్.

'సూపర్ మచ్చి' టీజర్ రిలీజ్
చిరంజీవి అల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ దేవ్ ఇప్పుడు పలు అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పులి వాసు దర్శకత్వంలో సూపర్ మచ్చి సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. కన్నడలో ‘మీనాక్షి’ అనే టైటిల్ తో వస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా కూడా కరోనా వల్ల ఇంత కాలం పెండింగ్ లో పడిపోయింది. ఇప్పుడు పెండింగ్ పనులను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ చేస్తున్నారు.

దుల్కర్ సల్మాన్ 'కురుప్' ట్రైలర్ రిలీజ్
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కురుప్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సెకండ్ షో సినిమా రాగా.. ఇప్పుడు వస్తున్న రెండో సినిమా ఇది. ఇక ఈసినిమా నవంబర్ 12 న ప్రేక్షకులముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈనేపథ్యంలో ఈసినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు మేకర్స్.

"రొమాంటిక్" పీనే కే బాద్ సాంగ్ మేకింగ్ వీడియో
పూరి కనెక్ట్స్ బ్యానర్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన యూత్ ఫుల్ రొమాంటిక్ యాక్టర్ ఎంటర్టైనర్“రొమాంటిక్” మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబడుతుంది. పూరి తనయుడికి ఎలాగైనా హిట్ ఇవ్వాలని సినీ ప్రముఖులంతా తమవంతు సపోర్ట్ చేశారు. ఇందులో "పీనే కే బాద్"సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లో ఉస్తాద్ హీరో రామ్ పోతినేని , పూరీ జగన్నాథ్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి థియేటర్స్ లో విజిల్స్ వేయించారు.

"RRR" మూవీ గ్లింప్స్ పై స్టార్ హీరోల స్పందన
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

'రాజా విక్రమార్క' ట్రైలర్ రిలీజ్
ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో కార్తికేయ మొదటి సినిమాతోనే మంచి హిట్ ను సాధించాడు. ఇక ఆసినిమా తర్వాత పలు సినిమాలు చేసినా అవి ఆశించినంత స్థాయిలో పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి. ఇటీవల చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇక ప్రస్తుతం కార్తికేయరాజా విక్రమార్క అనే యాక్షన్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. ఈసినిమా నవంబర్ 12న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక…

'మంచి రోజులు వచ్చాయి' టీమ్ కు శర్వా బెస్ట్ విషెస్..!
టాలీవుడ్ లో డిఫరెంట్ కామెడీతో తన మార్క్ ను చూపించిన ఈతరం డైరెక్టర్లలో మారుతి కూడా ఒకరు. ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా మంచి రోజులు వచ్చాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడుఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్లు, సాంగ్స్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.

"ఆశ ఎన్‌కౌంటర్"మూవీ ట్రైలర్ రిలీజ్
అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణ లో ఆనంద్ చంద్ర దర్శకత్వంలో సోనియా ఆకుల , శ్రీకాంత్ అయ్యంగార్ , ప్రవీణ్ రాజ్ ప్రధాన పాత్రలలో తెలంగాణ లోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార ఘటన, ఆపై ఎన్ కౌంటర్ ను ఆధారంగా తెరకెక్కిన "దిశ ఎన్‌కౌంటర్" మూవీ నవంబర్ 26 వ తేదీ రిలీజ్ కానుంది. డి ఎస్ ఆర్ సంగీతం అందించారు. మూవీ టైటిల్ పై అభ్యంతరాలు రావడం తో టైటిల్ ను "ఆశ ఎన్‌కౌంటర్" గా మార్చారు.

"అనుభవించు రాజా " మూవీ రిలీజ్ డేట్
అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్పీ బ్యానర్స్ పై శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ , కషిష్ ఖాన్ జంటగా పేకాట కోడిపందాల నేపథ్యంలో కామెడీ ఎంటర్ టైనర్ "అనుభవించు రాజా " మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. పోసాని , అజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపీసుందర్ సంగీతం అందించారు. పక్కా గోదావరి స్లాంగ్ లో రాజ్ తరుణ్ పలికే డైలాగ్స్, ఆయన గెటప్ సినిమాకి హైలైట్ కాబోతున్నాయి.

'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినిమా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన ఎన్టీఆర్-చరణ్ ఇంట్రడక్షన్ వీడియోలు ఏ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూశాం.
'పుష్పక విమానం' ట్రైలర్ రిలీజ్
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన కొత్త సినిమా "పుష్పక విమానం". ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. నవంబర్ 12న ఈసినిమా ప్రేక్షకులముందుకు రానుంది. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో నేడు ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈసందర్భంగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.