పూరి కనెక్ట్స్ బ్యానర్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన యూత్ ఫుల్ రొమాంటిక్ యాక్టర్ ఎంటర్టైనర్“రొమాంటిక్” మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబడుతుంది. పూరి తనయుడికి ఎలాగైనా హిట్ ఇవ్వాలని సినీ ప్రముఖులంతా తమవంతు సపోర్ట్ చేశారు. ఇందులో “పీనే కే బాద్”సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లో ఉస్తాద్ హీరో రామ్ పోతినేని , పూరీ జగన్నాథ్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి థియేటర్స్ లో విజిల్స్ వేయించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా “పీనే కే బాద్” సాంగ్ ఇస్మార్ట్ మేకింగ్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నైట్ ఎఫెక్ట్ లో షూట్ చేసిన ఈ సాంగ్ లో ఆకాష్ తో పాటుగా రామ్ పోతినేని కూడా స్టెప్పులు వేశారు. ‘హ్యాపీ హ్యాపీ మామా.. దిల్ కుష్ అయితదే.. పీనే కే బాద్’ అంటూ రామ్ అలరించారు. ఆకాష్ కు రామ్ బీరు తాగిస్తుంటే.. రామ్ నోట్లో ఆకాష్ సిగరెట్ పెడుతూ కనిపించారు.ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పాటను చిత్రీకరించారని మేకింగ్ వీడియో చూస్తే అర్థం అవుతోంది. సునీల్ కశ్యప్ ఈ సాంగ్ కు ట్యూన్ సమకూర్చడమే కాకుండా తనదైన శైలిలో ఆలపించారు. దీనికి గేయ రచయిత భాస్కర భట్ల లిరిక్స్ రాశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























