డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా చిత్ర యూనిట్ 45 సెకన్ల “RRR” మూవీ గ్లింప్స్ రిలీజ్ చేసింది. అద్భుతమైన విజువల్స్ , కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రూపొందిన గ్లింప్స్ ప్రేక్షకులతో పాటు , సినీ ప్రముఖులను ఆకట్టుకుంది. కేవలం 2 నిమిషాల్లో అత్యంత వేగంగా 100K లైక్స్ సాధించిన గ్లింప్స్ గా నిలిచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. RRR గ్లిమ్స్ కు సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుతున్నాయి. ”ఎలక్ట్రిఫైయింగ్!! ఇది చాలు!” అని మెగాస్టార్ చిరంజీవి , ”అద్భుతమైన విజువల్స్ చూపించి అబ్బురపరిచారు! జస్ట్ వావ్.. స్టన్నింగ్!! #RRR సినిమా చూడటానికి వేచి ఉండలేను” అని మహేష్ బాబు , ”#RRR యొక్క మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్, రాజమౌళి గారూ మీరు భారతీయ సినిమాకే గర్వకారణం. మా బ్రదర్ రామ్ చరణ్ , బావ ఎన్టీఆర్ పవర్ ప్యాక్ షో. అజయ్ దేవగన్ , అలియా భట్ మరియు మొత్తం నటీనటులు సిబ్బందికి అభినందనలు” అని అల్లు అర్జున్ ట్వీట్స్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: