ఆదిరెడ్డి. టి సమర్పణలో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై శ్రీ సారిపల్లి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా “రాజావిక్రమార్క “మూవీ నవంబర్ 12వ తేదీ రిలీజ్ కానుంది. తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో సుధాకర్ కోమాకుల, సాయి కుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ , బక్రీద్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ తమిళ సినీ నటుడు రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్రన్ కోలీవుడ్ లో మూడు సినిమాలలో కథానాయికగా నటించారు.“రాజావిక్రమార్క “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఆ మూవీ రిలీజ్ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో తాన్య రవిచంద్రన్ పాత్రికేయులతో ముచ్చటించారు. కథానాయికగా తెలుగులో తన తొలి సినిమా “రాజావిక్రమార్క “ అనీ , ఈ మూవీ లో కాంతి అనే అమ్మాయిగా నటించాననీ , హోమ్ మినిస్టర్ కూతురు అయినా సామాన్య జీవితాన్ని గడపాలని తపిస్తుంటుందనీ , క్లాసికల్ డ్యాన్సర్‌గా గొప్ప పేరుతెచ్చుకోవాలని అనుకున్న ఆమె జీవితంలో ఓ ఎన్‌ఐఏ ఏజెంట్ ఎలా ప్రవేశించాడన్నది ఆసక్తికరంగా ఉంటుందనీ , పదిహేనేళ్లుగా భరతనాట్యం నేర్చుకుంటున్నాననీ , డ్యాన్స్ తెలియడంతో పాత్రలో ఒదిగిపోవడం సులభమైందనీ , తన రియల్‌లైఫ్‌కు ఈ పాత్రతో కొన్ని పోలికలున్నాయనీ , కమర్షియల్ సినిమాల్లో మాదిరిగా పాటలు, కొన్ని సన్నివేశాలకే పరిమితం కాకుండా సినిమా మొత్తం కనిపిస్తాననీ , కార్తికేయ నటనలో సహజత్వం నచ్చుతుందనీ , అందరితో స్నేహంగా ఉంటారనీ , పాత్రకు ప్రాధాన్యముందనిపిస్తే కమర్షియల్ సినిమాల్ని కూడా అంగీకరిస్తాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: