టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గరనుండి ఇప్పుడు హీరోగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే మొత్తానికి వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇక రీసెంట్ గా తిమ్మరుసు సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సత్యదేవ్ ప్రస్తుతం తన ఖాతాలో ఉన్న సినిమాలను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. అందులో స్కైలాబ్ సినిమా కూడా ఉంది. విశ్వక్ కందేరావు దర్శకత్వంలో సత్యదేవ్ , నిత్య మీనన్ , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సినిమా స్కైలాబ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా… తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నాడు. బైట్ ఫీచర్స్ , నిత్య మీనన్ కంపెనీ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
A walk down our history will be a run of comedy! Witness the madness🔥
Our #SkylabTrailer is all yours now ✨
👉 https://t.co/KfsjNVc2eT#SKYLAB 🛰️@MenenNithya @ActorSatyaDev @eyrahul @VishvakKhander1 @prashanthvihari @Prithvi_sp #NithyaMenenCompany @adityamusic @vamsikaka pic.twitter.com/11p1QF1Uz9
— Byte Features (@ByteFeatures) November 6, 2021
దీనితోపాటు ఇంకా గుర్తుందా శీతాకాలం,‘గాడ్సే సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈసినిమాలు కూడా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. ఇక ఇదిలా ఉండగా సత్యదేవ్ బాలీవుడ్ లో కూడా సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ శర్మ దర్శకత్వంలో ‘రామ సేతు’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో ఓ కీలక పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: