గతంలో పలు సినిమాల్లో కామెడియన్ గా చేసిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తీసాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. తనకు రాజకీయాలు సెట్ కావని బయటకు వచ్చేశాడు. మళ్ళీ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో ‘డేగల బాబ్జీ’ అనే సినిమాతో వస్తున్నాడు. వెంకట్ చంద్ర దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. తమిళంలో పార్తీబన్ హీరోగా నటించిన ‘ఒత్తుసెరుప్పు సైజ్ 7’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ను చూస్తుంటే మాత్రం ఆకట్టుకుంటుంది. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన ‘డేగలబాబ్జీ’ అనే వ్యక్తిగా బండ్ల గణేష్ నటన ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఈ ట్రైలర్లో ‘అసలు మా అమ్మ అందంగా ఉండాలన్న రూల్ ఏమైనా ఉందా? ‘పుట్టగానే వాడు ఏడవలేదు.. అందుకే వాడు పుట్టినప్పటి నుంచి మేం ఏడుస్తూనే ఉన్నాం’ అనే డైలాగులు బాగున్నాయి. కాగా యస్రిషి ఫిల్మ్స్ పతాకంపై స్వాతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Here it is..
The much awaited trailer of @ganeshbandla‘s #DegalaBabji
Ace Director @purijagan garu launched the trailer and wished the best to the entire team..Trailer https://t.co/paikprh3Ja#VenkatChandra#YashRishiFilms#DegalaBabjiTrailer #డేగలబాబ్జి@adityamusic pic.twitter.com/uXANHMjLRQ
— Nikil Murukan (@onlynikil) November 8, 2021




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























