దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్‘ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినిమా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన ఎన్టీఆర్-చరణ్ ఇంట్రడక్షన్ వీడియోలు ఏ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూశాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా రిలీజ్ దగ్గర పడుతుండటంతో మరో పక్క రాజమౌళి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించాడు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. నిజానికి ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ వీడియోను రెండు రోజుల క్రితమే రిలీజ్ చేయాలి కానీ కొన్ని కారణాల వల్ల అనుకోకుండా వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో నేడు రిలీజ్ చేస్తున్నట్టు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక అభిమానులు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మరి రాజమౌళి సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంచనాలకు తగ్గట్టే ఉంది ఈ గ్లింప్స్ వీడియో. మరి 40 సెకన్ల వీడియోనే ఇలా ఉంటే సినిమా ఇంకెలా ఉంటుందో అర్థంచేసుకోవచ్చు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: