మొత్తానికి మారుతి చాలా తక్కువ బడ్జెట్ తో తక్కువ రోజుల్లో సినిమాలు తీసి హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. రీసెంట్ గా మంచి రోజులు వచ్చాయి సినిమాతో మరో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన ఈసినిమాలో దీపావళి రోజున విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా ను మారుతి కేవలం 30 రోజుల్లో పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Presenting the KICKASS teaser of Macho Starr @YoursGopichand & Blockbuster @DirectorMaruthi‘s #PakkaCommercial 😎🤙#PakkaCommercialTeaser ▶️ https://t.co/sU9ezUufOx #AlluAravind @RaashiiKhanna_ #BunnyVas @JxBe #KarmChawla #Raveendar @SKNonline @UV_Creations @GA2Official pic.twitter.com/Ya76IiQORa
— UV Creations (@UV_Creations) November 8, 2021
ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా రాశీ ఖన్నా నటిస్తుంది. గతంలో జిల్, ఆక్సీజన్ సినిమాల్లో కలిసి నటించారు గోపీచంద్, రాశీ ఖన్నా. సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీవాసు నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: