“సూపర్” మూవీ తో టాలీవుడ్ కు , “రెండు”మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కు అనుష్క పెట్టింది పేరుగా మారారు. “విక్రమార్కుడు”, “అరుంధతి “, “వేదం”, “బాహుబలి“, “రుద్రమదేవి “, “భాగమతి ”
వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అనుష్క ఆకట్టుకున్నారు. పలు మూవీస్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. “నిశ్శబ్దం” మూవీ తరువాత అనుష్క మరే సినిమా అంగీకరించలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనుష్క బర్త్ డే (నవంబర్ 7) సందర్భంగా అనుష్క 48 వ మూవీ అనౌన్స్ మెంట్ అవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.యు వి క్రియేషన్స్ వారు అనుష్క తో హ్యాట్రిక్ మూవీని నిర్మించబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. సూపర్ హిట్ “మిర్చి”, “భాగమతి'”మూవీస్ తరువాత అనుష్క 3 వ చిత్రాన్ని యు వి క్రియేషన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.స్టార్ హీరోయిన్ అనుష్క 48 వ మూవీ గా తెరకెక్కనున్న ఈ మూవీకి “రారా కృష్ణయ్య” మూవీ ఫేమ్ మహేష్ దర్శకత్వం వహించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: