ప్రస్తుతం ఉన్న సినీ పరిశ్రమల్లో చాలా మార్పులు వచ్చాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొత్తగా ప్రయత్నిస్తున్నారు. హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. కొంతమంది డైరెక్టర్లు హీరోలుగా మారి సినిమాలు తీస్తున్నారు.. అలాగే కొంత మంది నిర్మాతలుగా మారుతున్నారు. మరి హీరోయిన్లు మాత్రం సైలెంట్ గా ఉంటారా. వాళ్లు కూడా ఫామ్ లో ఉన్నప్పుడే అన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పుడు నిర్మాతలుగా కూడా మారుతున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ నుంచి అప్‌కమింగ్ హీరోయిన్ అవికా గోర్ వరకూ నిర్మాతలుగా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఇక తాజాగా మరో హీరోయిన్ హీరో కూడా ఈ లిస్ట్ లో చేరింది ఆహీరోయిన్ ఎవరో కాదు అమలా పాల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీతో నిర్మాతగా తొలి అడుగు వేస్తోంది అమలా పాల్. అనూప్ ఎస్ ప్యానికర్ డైరెక్టర్ చేస్తున్న ‘కడావర్’ సినిమాలో అమలా పాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండటమే కాకుండా నిర్మిస్తుంది. ఇక తన పుట్టినరోజు సందర్భంగా పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. మార్చురీలో శవాల మధ్య కూర్చుని భోజనం చేస్తోంది అమల. పక్కనే ఓ గాజు సీసాలో కట్ చేసిన అవయవాలు కూడా ఉన్నాయి. భయంకరంగా ఉన్న ఈ పోస్టర్‌కి సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
ఇక మొదటి నుండి అమలా పాల్ కాస్త విభిన్నమైన సినిమాలే ఎంచుకుంటుంది. అయితే ఎప్పటినుండో అమలా ఓ మంచి హిట్టు కోసం ఆశగా ఎదురు చూస్తోంది. మరి ఈసినిమాతో అమలా పాల్ ఆ హిట్ ను అందుకుంటుందేమో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: