జిల్ ఫేమ్ రాాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా రిలీజ్ సంగతి పక్కన పెడితే అప్ డేట్స్ కోసం మాత్రం ఫ్యాన్స్ ఎప్పటినుండో చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో చాలా గ్యాప్ తరువాత ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ వీడియోకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. విజువల్స్, విక్రమాదిత్యగా ప్రభాస్ లుక్ ఓ రేంజ్‌లో ఉండటంతో టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ టీజర్‌ను చూస్తుంటే.. సినిమాపై మరింత ఆసక్తి పెరగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలాఉండగా ఈ టీజర్ మిలియన్స్ వ్యూస్ ను సంపాదించి రికార్డు క్రియేట్ చేసి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే కదా. అయితే 63 మిలియన్స్ గా ఉన్న వ్యూస్ ఒక్కసారిగా 62 మిలియన్స్ కి పడిపోయాయి. ఇది గమనించిన ఫ్యాన్స్ ఎందుకిలా జరిగింది అంటూ యూట్యూబ్ టీమ్‌కి ట్విటర్‌లో మేసేజ్ పెట్టారు. అభిమానుల ట్వీట్‌లకి స్పందించిన ఆ టీమ్ కారణాన్ని తెలియజేసింది. ‘యూట్యూబ్ వ్యాలిడేట్ చేసే విధానం వల్ల వ్యూస్ అప్డేట్ చేయడంలో ఆలస్యం జరుగుతుంటుంది. ఒక్కోసారి తాత్కాలికంగా నెమ్మదించడం లేక వ్యూస్ ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంటుంది’ అని ఆ టీమ్ తెలిపింది.
Thanks for reaching out – there may be a delay in the view count because of how YouTube validates views. Temporarily slowing down or even freezing a video’s view count is expected, here are more details about why this happens and how it works: https://t.co/x3N7d5IYy2
— TeamYouTube (@TeamYouTube) October 27, 2021
కాగా యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: