ఐకాన్ స్టార్ అల్లు అర్జున్– మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకూ మూడు సినిమాలు రాగా.. మూడు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దీంతో వీరిద్దరిది బెస్ట్ కాంబినేషన్ గా నిలిచింది. ఇటీవల వచ్చిన అల వైకుంఠపురములో సినిమా అయితే హిట్ అవ్వడమే కాకుండా ఆ సినిమాలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యాయో చూశాం. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా అంటే అభిమానులకు అది మంచి కిక్ ఇచ్చే న్యూసే అవుతుంది కదా. ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి చక్కర్లు కొడుతుంది. దానికి కారణం ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన ట్వీటే కారణం. అసలు సంగతేంటంటే..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా వేదికగా ఒక ఫొటోను పోస్ట్ చేస్తూ త్వరలోనే ఓ సర్ప్రైజ్ రాబోతోందని తాజాగా వెల్లడించారు. ఇక ఈఫొటోలో త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్, సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ ఉన్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో నాలుగో సినిమా రాబోతుందేమో అని.. అదే సర్ ప్రైజ్ ఉంటుందేమో అన్న వార్తలు మొదలయ్యాయి. మరి ఆ సర్ ప్రైజ్ ఏంటో తెలియాలంటే మాత్రం అప్పటివరకూ వెయిట్ చేయాల్సిందే.
a suprise coming up very soon @haarikahassine pic.twitter.com/I8wECi7JEH
— Naga Vamsi (@vamsi84) October 28, 2021
కాగా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాగా వస్తున్న పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్‌గా కనిపించనుండగా, ఆయనకు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈసినిమా తరువాత పలు సినిమాలు లైన్ లో ఉన్నాయి. మరోవైపు త్రివిక్రమ్ మహేష్ తో సినిమా చేయనున్నాడు. మరి ఎప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా లైన్ లోకి వస్తుందో చూడాలి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: