సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన షాలిని పాండే , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “మహానటి “, “118 “మూవీస్ తో షాలిని ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో మూడు సినిమాలకు షాలిని అగ్రిమెంట్ చేశారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై దివ్యాంగ్ తక్కర్ దర్సకత్వంలో రణ్ వీర్ సింగ్ , షాలిని పాండే జంటగా తెరకెక్కిన “జయేశ్ భాయ్ జోర్దార్” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ తో షాలిని బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. కరోనా కారణంగా ఈ మూవీ రిలీజ్ డిలే అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో మూడు సినిమాలలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని షాలిని చెప్పారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. చక్కనమ్మ చిక్కినా అందమే అన్న విధంగా స్లిమ్ గా మారిన షాలిని తన ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. అందంగా ఉన్న ఆ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: