టాలీవుడ్ లో ప్రస్తుతం పలు మలయాళ సినిమాలు రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరో రీమేక్ సెట్స్ పైకి వచ్చింది. మలయాళంలో ఈ ఏడాది వచ్చిన నాయట్టు సినిమా మంచి సూపర్ హిట్ అవ్వగా ఇక ఈసినిమాను కూడా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా హక్కులను అల్లు అరవింద్ వారి జీఏ2 పిక్చర్స్ దీని హక్కులను సొంతం చేసుకున్న సంగతి కూడా విదితమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాాగా ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనులు, కాస్టింగ్ ఎంపికలో ఉన్న మేకర్స్ ఇప్పుడు షూటింగ్ కు రెడీ అయిపోయారు. పలాస సినిమాతో ఇండస్ట్రీలో తమ మార్క్ ను చూపించిన కరుణ కుమార్ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నాడు. రావు రమేష్, ప్రియదర్శి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. తమిళంలో జార్జ్ జోసెఫ్ చేసిన కీలక పాత్రను రావు రమేష్, కుంచుకో చేసిన పాత్రను ప్రియదర్శి, నిమిష క్యారెక్టర్లో అంజలి కనిపించనున్నారు. బన్నీ వాసు, దివ్య మాధురి కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు.
#AlluAravind Presents – @GA2Official‘s Production No – 7 launched today! 🤩
Produced by #BunnyVass, #VidyaMadhuri
Here are the pics from the pooja ceremony. ✨@yoursanjali @priyadarshi_i #RaoRamesh @Karunafilmmaker #ManiSharma @NavinNooli #ArulVincent #AshishTeja pic.twitter.com/CxUeahCI1N
— GA2 Pictures (@GA2Official) October 31, 2021
కాగా మార్టిన్ ప్రకట్ దర్శకత్వంలో కుంచాకో బోబన్, జోజు జార్జ్, నిమిష సాజయన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయి మంచి ప్రేక్షకాదరణ పొందింది. మరి తెలుగులో ఈసినిమా ఎంత వరకూ విజయం దక్కించుకుంటుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: