
ట్యాగ్ · 290 కథనాలు


"భోళా శంకర్"మూవీ అప్ డేట్

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' వాయిదా పడ్డ టీజర్

రవితేజ "రావణాసుర" సంక్రాంతి కి ప్రారంభం

'ఒకే ఒక జీవితం'.. టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

'చైతు' సింప్లిసిటీకి ఫ్యాన్ ఫిదా..!

టాలీవుడ్ పై తమిళ హీరోల ఫోకస్

త్వరలో రానున్న 'బంగార్రాజు'.. షూట్ లాస్ట్ డే

ఇండస్ట్రీలో ఉండటం అంత ఈజీ కాదు..!

సందీప్ కిషన్ కు జోడీగా 'మజిలీ' భామ

హెబ్బా పటేల్ న్యూ లుక్

సెకండ్ షెడ్యూల్ లో 'భోళా శంకర్'

డిసెంబర్ లో స్పోర్ట్స్ డ్రామాల సందడి

'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ ఫిక్స్

అల్లు అర్జున్ కు రష్మిక స్పెషల్ గిఫ్ట్

నాని 'దసరా' కోసం భారీ విలేజ్ సెట్..!
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు నాని. ప్రస్తుతం నాని తన కొత్త ప్రాజెక్ట్ లను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే అంటే సుందరానికి సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈసినిమాతో పాటు నాని దసరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

"భోళా శంకర్"మూవీ అప్ డేట్
ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. చిరంజీవికి కీర్తీ సురేశ్ రాఖీ కడుతున్న ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మెగా స్టార్ చిరంజీవి , కీర్తి సురేష్ ల వీడియో క్లిప్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.“భోళా శంకర్”మూవీ లోని తన పాత్ర కోసం చిరంజీవి పూర్తి డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించబోతున్నారు.

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' వాయిదా పడ్డ టీజర్
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్, ఫస్ట్‌లుక్ చిత్రంపై క్యూరియాసిటీని పెంచేసింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్‌ను నేడు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వల్ల టీజర్‌ను విడుదల చేయలేకపోయింది. ఇక ఈ విషయాన్ని తెలియచేస్తూ చిత్రయూనిట్ అధికారికంగా తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వేదికగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సాంకేతిక కారణాల…

రవితేజ "రావణాసుర" సంక్రాంతి కి ప్రారంభం
బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ పలు మూవీస్ కు కమిట్ అయ్యారు. సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో హై వోల్టేజ్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు.

ప్రయోగాత్మక మూవీస్ కు ప్రాధాన్యత ఇస్తా -నభా నటేష్
మోడల్ , థియేటర్ ఆర్టిస్ట్ నభా నటేష్ “నన్ను దోచుకుందువటే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నభా నటేష్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "సోలో బ్రతుకే సో బెటర్" , "అల్లుడు అదుర్స్" , "మాస్ట్రో" మూవీస్ తో నభా నటేష్ ప్రేక్షకులను అలరించారు.

'ఒకే ఒక జీవితం'.. టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు హీరో శర్వానంద్. ఇటీవలే మహాసముద్రంతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం నూతన దర్శకుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ తమిళ్, తెలుగులో ఒకే ఒక జీవితం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా కరోనా వల్ల ఇప్పటికే లేట్ అయింది. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గానే ప్రకటించింది చిత్రయూనిట్.

బాలీవుడ్ ఎంట్రీ కి స్క్రిప్ట్ ముఖ్యం - సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన"లవ్ స్టోరీ", “శ్యామ్ సింగరాయ్" మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సాయి పల్లవి కథానాయికగా తెరకెక్కిన ”విరాటపర్వం “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక తమిళ మూవీ , ఒక కన్నడ మూవీ కి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'చైతు' సింప్లిసిటీకి ఫ్యాన్ ఫిదా..!
టాలీవుడ్ లో మన హీరోలను అభిమానులు ఎలా ఆరాధిస్తారో మనకు తెలిసిందే. హీరోలను ఆ రేంజ్ లో అభిమానించడం మన దగ్గరే కాస్త ఎక్కువ ఉంటుంది. ఇక హీరోలు కూడా తమ అభిమానులను అలానే చూస్తుంటారు. ఫ్యాన్స్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అందుకే తమ ప్రతి సక్సెస్ లో అభిమానుల పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఒక సంఘటనలో నాగచైతన్య సింప్లిసిటీకి ఒక ఫ్యాన్ ఫిదా అయి తన ఎక్స్ పీరియన్స్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం జరిగింది.

టాలీవుడ్ పై తమిళ హీరోల ఫోకస్
కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్ , విజయ్ , విక్రమ్ , సూర్య ,ధనుష్, కార్తీ , శివ కార్తికేయన్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ హీరోలకు తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా అధికమే. తెలుగు మూవీస్ సక్సెస్ రేటు , భారీబడ్జెట్ లు , భారీ పారితోషికాలు ఉండడంతో కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ మూవీస్ పై అధిక ఆసక్తి కనపరుస్తున్నారని సమాచారం.

త్వరలో రానున్న 'బంగార్రాజు'.. షూట్ లాస్ట్ డే
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున -నాగచైతన్య ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బంగార్రాజు అసలు ఈసినిమా సీక్వెల్ ఎప్పుడో అనుకున్నారు కానీ అది సెట్స్ పైకి వెళ్లేసరికే చాలా ఆలస్యమైంది. మధ్యలో కరోనా కూడా రావడంతో ఇంకా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇటీవలే ఈసినిమాను ప్రారంభించారు. అలా ప్రారంభించారో లేదో ఎక్కడా గ్యాప్ లేకుండా చాలా తొందరగానే కంప్లీట్ చేసేశారు. ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. ప్రస్తుతం నాగచైతన్య-కృతిశెట్టి కు సంబంధించి ఒక సాంగ్ ను చిత్రీకరిస్తుండగా నేటితో షూటింగ్ పూర్తయిపోతుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ కూడా తెలిపింది. ఇక ఒక పక్క షూటింగ్ చేస్తూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా…

ఇండస్ట్రీలో ఉండటం అంత ఈజీ కాదు..!
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ స్టేటస్ అనేది అంత ఈజీగా వచ్చేది ఏం కాదు. ఏదో అదృష్టం కలిసొచ్చిందిలే అందుకే హీరో లు, హీరోయిన్స్ అయ్యారు అని అనుకుంటే తప్పే అవుతుంది. ఏం చేసినా ఫైనల్ గా ప్రేక్షకులకు నచ్చితేనే ఇక్కడ టాప్ లో ఉండగలుగుతారు. అందులోనూ ఇప్పుడున్న కాంపిటీషన్ ను నెగ్గుకురావాలంటే చాలా కష్టపడాలి. ఇక ఇదే విషయాన్ని చెబుతుంది ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందన్న.

సందీప్ కిషన్ కు జోడీగా 'మజిలీ' భామ
యంగ్ హీరో సందీప్ కిషన్ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ఈఏడాదిని ప్రారంభించిన సందీప్ కిషన్.. తాజాగా గల్లీ రౌడీ సినిమాను కూడా రిలీజ్ చేశాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం తను వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా సినిమా వస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగాహాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈసినిమాకు…

ప్రత్యేక సెట్ లో "ఖిలాడి" మాస్ సాంగ్ షూటింగ్
పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'ఎఫ్ 3' టీమ్ నుండి వెంకీ కి స్పెషల్ బర్త్ డే విషెస్..!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ ఎఫ్ 2 ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసుకదా. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇక ఇప్పుడు ఎఫ్ 3 అంటూ వస్తున్నారు. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఇదిలాఉండగా నేడు వెంకీ బర్త్ డే అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రయూనిట్ స్పెషల్ వీడియోతో వెంకీకి స్పెషల్ బర్త్ డే విషెస్ అందించింది.

హెబ్బా పటేల్ న్యూ లుక్
“అలా ఎలా “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన హెబ్బా పటేల్ సూపర్ హిట్ ”కుమారి 21 F “ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఎక్కడికి పోతావు చిన్నవాడా “, “అంధగాడు “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో హెబ్బా పటేల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “భీష్మ “మూవీ లో అతిథి పాత్రలో , “RED ” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ తో హెబ్బాపటేల్ ప్రేక్షకులను అలరించారు.

కన్నడ అమ్మాయి గా గుర్తింపు పొందడమే ఇష్టం- పూజాహెగ్డే
తమిళంలో "ముగమూడి ", తెలుగులో ‘ఒక లైలా కోసం’, హిందీలో ‘మొహంజోదారో’ చిత్రాలతో పూజాహెగ్డే కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “#SSMB28” , "#PSPK 28" మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

సెకండ్ షెడ్యూల్ లో 'భోళా శంకర్'
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకటి రెండు కాదు.. ఈయన ఏకంగా 4 సినిమాలు చేస్తున్నాడు. అందులో ఆచార్య సినిమా ఇప్పటికే షూటింగ్ ను సైతం ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ కూడా సిద్ద అనే కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఫిబ్రవరి 4, 2022న విడుదల కానుంది ఈ చిత్రం.

డిసెంబర్ లో స్పోర్ట్స్ డ్రామాల సందడి
డిసెంబర్ నెలలో 4 స్పోర్ట్స్ డ్రామా మూవీస్ ప్రేక్షకులను అలరించనున్నాయి. తెలుగు లో 2 , హిందీ లో 2 మూవీస్ రిలీజ్ కానున్నాయి.

'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజ రవితేజ క్రాక్ సినిమా హిట్ కావడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టిన రవితేజ ఈసినిమాలను కూడా ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఇప్పటికే రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పన్నుల్లో ఉంది. ఇక 68వ సినిమా త్రినాథరావు దర్శకత్వంలో ‘ధమాకా’ కూడా షూటింగ్ దశలో ఉంది.

అల్లు అర్జున్ కు రష్మిక స్పెషల్ గిఫ్ట్
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఈ మూవీ విడుదల కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి. “పుష్ప: ది రైజ్” మూవీ లో ఫహాద్ ఫాజిల్ , ప్రకాష్ రాజ్ , సునీల్, అనసూయ ముఖ్య పాత్రలలో నటించగా , స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు.