బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన”లవ్ స్టోరీ“, “శ్యామ్ సింగరాయ్” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సాయి పల్లవి కథానాయికగా తెరకెక్కిన ”విరాటపర్వం “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక తమిళ మూవీ , ఒక కన్నడ మూవీ కి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి తన బాలీవుడ్ ఎంట్రీ గురించి మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. బాలీవుడ్ ఎంట్రీ కి తాను సిద్ధం అనీ , స్క్రిప్ట్ చాలా ముఖ్యం అనీ , తనకు సూట్ అయ్యే పర్ ఫెక్ట్ కేరక్టర్ తో స్క్రిప్ట్ ఉండాలనీ , అప్పుడే బాలీవుడ్ లోకి వెళ్ళడానికి ఇష్టపడతాననీ , అవకాశం వచ్చింది కదా అని తన మనస్తత్వానికి విరుద్ధంగా సినిమా చేయననీ చెప్పారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: