కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్ , విజయ్ , విక్రమ్ , సూర్య ,ధనుష్, కార్తీ , శివ కార్తికేయన్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ హీరోలకు తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా అధికమే. తెలుగు మూవీస్ సక్సెస్ రేటు , భారీబడ్జెట్ లు , భారీ పారితోషికాలు ఉండడంతో కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ మూవీస్ పై అధిక ఆసక్తి కనపరుస్తున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల , ధనుష్ హీరోగా ఒక మూవీ ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా ఒక తెలుగు మూవీ ని అనౌన్స్ చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో “సార్ “మూవీ తెరకెక్కనుంది. బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు” మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో కార్తికేయన్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ స్టార్ హీరోల స్ట్రయిట్ తెలుగు మూవీస్ ను తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: