మాస్ మహారాజ రవితేజ క్రాక్ సినిమా హిట్ కావడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టిన రవితేజ ఈసినిమాలను కూడా ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఇప్పటికే రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పన్నుల్లో ఉంది. ఇక 68వ సినిమా త్రినాథరావు దర్శకత్వంలో ‘ధమాకా’ కూడా షూటింగ్ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా వీటితో పాటు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటి వరకూ ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈసినిమాను కూడా రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈసినిమాను వచ్చే ఏడాది మార్చి 25న రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Rama Rao will take charge from 25th March, 2022 😎#RamaRaoOnDutyFromMarch25 in Theatres 💥💥#RamaRaoOnDuty@RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @Cinemainmygenes @sathyaDP @SamCSmusic @sahisuresh @RTTeamWorks pic.twitter.com/4ZQW5BUare
— SLV Cinemas (@SLVCinemasOffl) December 6, 2021
కాగా ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తోన్నఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: