కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Krishna Vamsi

ట్యాగ్ · 40 కథనాలు

Creative Genius Krishna Vamsi's Khadgam Grand Re Release Tomorrow
సినిమా వార్తలు

రేపు రీ రిలీజ్ అవుతోన్న ఖడ్గం

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. అగ్ర హీరోలు నటించిన ఒకప్పటి హిట్ సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు మేకర్స్. ఇది ఆయా హీరోల అభిమానులనే కాకుండా మూవీ లవర్స్ అందరికి థ్రిల్ అందిస్తోంది. దీంతో ఇటు ఆడియెన్స్, అటు ప్రొడ్యూసర్స్ ఇద్దరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Khadgam Ready For Re Release
సినిమా వార్తలు

రీ రిలీజ్‌కి సిద్దమైన ఖడ్గం

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఖడ్గం. ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్‌కి ముస్తాబవుతున్న తరుణం లో చిత్ర యనిట్ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. 22 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నందుకు దర్శకులు కృష్ణవంశీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్ర విశేషాలని పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Khadgam Re Release 02nd October
సినిమా వార్తలు

రీ రిలీజ్ కానున్న ఖడ్గం

రీ రిలీజ్ ల ట్రెండ్ నేపథ్యంలో సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన కల్ట్ మూవీ ఖడ్గం మళ్ళీ రిలీజ్ కానుంది.గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2న ఈసినిమా రీ రిలీజ్ కానుంది.దేశ భక్తి నేపథ్యంలో కమర్షియల్ ఫార్ములా తో తెరకెక్కిన ఈసినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.శ్రీకాంత్,రవితేజ,ప్రకాష్ రాజ్ లీడ్ రోల్స్ లో నటించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.మధు మురళి ఈసినిమాను నిర్మించాడు.2002 లో వచ్చిన ఈసినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడమే కాకుండా పలు అవార్డులు కూడా గెలుచుకుంది.

Mahender Reddyవాట్సాప్
Murari Re-release Superstar Mahesh Babu Fans Hungama at Theatres
సినిమా వార్తలు

మురారి రీ రిలీజ్.. థియేటర్ల వద్ద మహేష్ ఫ్యాన్స్ కోలాహలం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శుక్రవారం జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన ‘మురారి’ చిత్రం మళ్ళీ విడుదలైంది. 4k టెక్నాలజీతో సరికొత్త హంగులతో ముస్తాబై నేడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా గ్రాండ్ రీ రిలీజ్ అయింది.

Srikanth Mవాట్సాప్
Murari Re-release Director Nandini Reddy Reminisces Mahesh Babu's Blockbuster
సినిమా వార్తలు

మురారి సెట్స్‌లో మహేష్ బాబు ఎంత అల్లరి చేసేవారంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఆగస్టు 9న 'మురారి' రీ రిలీజ్‌ అవుతున్న విషయం తెలిసిందే. అలాగే దీనికి ఒక్కరోజు ముందు 'ఒక్కడు' సినిమా కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో విడుదలకానుంది. ఇక రీ రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ సూపర్ స్టార్ అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. తమ అభిమాన హీరో చిత్రాలు రెండు ఒక్కరోజు వ్యవధిలో థియేటర్లలోకి వస్తుండటంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Srikanth Mవాట్సాప్
mahesh babu murari movie re release trailer out now
ట్రైలర్ & టీజర్

మురారి రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది

ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. సెలబ్రిటీల పుట్టిన రోజుల సందర్భాలు, ప్రత్యేక అకేషన్స్ అప్పుడు సినిమాలను రీ రిలీజ్ లు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమా రీ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆ సినిమా మరేదో కాదు మహేష్ బాబు హీరోగా వచ్చిన మురారి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 2001లో విడుదలైన ఈసినిమా మహేష్ సినీ కెరీర్ నే ఒక మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందుకుంది. కథ, కథాంశం, మహేష్ నటన, పాటలు అన్నీ సినిమా విజయంలో భాగమయ్యాయి.

TFN Adminవాట్సాప్
mahesh babu murari movie re release trailer update
ట్రైలర్ & టీజర్

మురారి రీ రిలీజ్‍ ట్రైలర్ రిలీజ్ అప్ డేట్

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ-రిలీజ్‍ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని మేకర్స్ వాటిని రీ-రిలీజ్‍ చేస్తున్నారు. ఇక రీ-రిలీజ్‍లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు రెండు చేరాయి. ఆయన హీరోగా న‌టించిన సూప‌ర్ హిట్ ఫిల్మ్స్ ‘ఒక్కడు’ మరియు 'మురారి' త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాయి.

TFN Adminవాట్సాప్
alanaati ramachandrudu movie trailer out now
ట్రైలర్ & టీజర్

అలనాటి రామచంద్రుడు ట్రైలర్ రిలీజ్

చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో కృష్ణ వంశీ, మోక్ష హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లవ్ ఎంటర్ టైనర్ అలనాటి రామచంద్రుడు. ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించారు. ఆగష్ట్ 2 వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ వరుసగా అప్ డేట్లను ఇస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
mahesh babu murari movie re release interesting update
సినిమా వార్తలు

మురారి రీ రిలీజ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ఎవర్ గ్రీన్ గా గుర్తుండిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి. అందులో మురారి సినిమా కూడా ఉంటుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఈసినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2001లో విడుదలైన ఈసినిమా మహేష్ సినీ కెరీర్ నే ఒక మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందుకుంది. కథ, కథాంశం, మహేష్ నటన, పాటలు అన్నీ సినిమా విజయంలో భాగమయ్యాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రంగమార్తాండ టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్

చాలా గ్యాప్ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన సినిమా రంగమార్తాండ.ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు.అమ్మానాన్నల కథతో తెరకెక్కిన ఈచిత్రం ఈఏడాది ఉగాది రోజున విడుదలై పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా టీవిలో కూడా రానుంది.ఈఆదివారం సాయంత్రం 6గంటలకు స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది.థియేటర్లలో,ఓటిటి లో చూడని వాళ్ళు టీవిలో చూడొచ్చు.

Mahender Reddyవాట్సాప్
rangamarthanda movie now streaming on this ott platform
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన రంగమార్తాండ

కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాలను ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఇక ఈవిషయం మరోసారి నిరూపించారు. ఈమధ్య కాలంలో అలా వచ్చిన సినిమాల్లో రంగమార్తాండ ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా గత నెలలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. ఈసినిమా ద్వారా ల్లితండ్రులు బాగున్నప్పుడే వారిని చూసుకోవాలని మెసేజ్ ను ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈసినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో ఈసినిమా అమెజాన్ లో నేటి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ ఎమోషనల్ రైడ్…

TFN Adminవాట్సాప్
Chiranjeevi emotional words on Rangamarthanda
సినిమా వార్తలు

రంగమార్తాండ కంటతడి పెట్టిస్తుంది

చాలా గ్యాప్ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రంగమార్తండ వంటి మంచి ఎమోషనల్ ఎంటర్ టైనర్ తో వచ్చి ప్రేక్షకుల మనస్సులను హత్తుకున్నారు. అంతేకాదు ఈసినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. ఇక ఇలాంటి కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాలకు ఈమధ్య సపోర్ట్ కూడా బాగానే వస్తుంది. పెద్ద పెద్ద స్టార్లు సైతం సినిమాలను చూస్తూ ఇలాంటి సినిమాలు తీసే మేకర్స్ కు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Chiranjeevi Felicitates Brahmanandam for Rangamarthanda Success
సినిమా వార్తలు

రంగమార్తాండలో బ్రహ్మానందం నటనకు చిరంజీవి షాక్

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ,రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రంగమార్తాండ. అమ్మానాన్నల కథతో తెరకెక్కిన ఈచిత్రం ఉగాది రోజున విడుదలై పాజిటివ్ రివ్యూస్ మరియు పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రంలో లెజండరీ కమెడియన్, బ్రహ్మనందం కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. చక్రపాణి అనే పాత్రలో బ్రహ్మనందం , ప్రకాష్ రాజ్ కు స్నేహితుడు గా కనిపించగా ఆ పాత్ర ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఇప్పటివరకు కమెడియన్ గా ప్రేక్షకులను నవ్వించిన బ్రహ్మనందం ,రంగమార్తాండలో ఎమోషనల్ పాత్రలో నటించి ప్రేక్షకుల చేత కన్నీళ్లు…

Mahender Reddyవాట్సాప్
rangamarthanda movie gets super response
సినిమా వార్తలు

రంగమార్తాండ కు పాజిటివ్ రెస్పాన్స్

ప్రతి శుక్రవారం, ప్రతి పండక్కి ఇలా పలు స్పెషల్ అకేషన్స్ కు బాక్సాఫీస్ వద్ద సినిమాలు సందడి చేస్తూనే ఉన్నాయి. ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల మనసులను హత్తుకుంటాయి.. ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేయడమే కాకుండా మంచి మెసేజ్ ను కూడా ఇస్తుంటాయి. ఈ కోవలోకే వస్తుంది తాజాగా వచ్చిన రంగమార్తాండ సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

TFN Adminవాట్సాప్
ramya krishnan sharing interesting facts about rangamarthanda movie
సినిమా వార్తలు

రంగమార్తాండ - ఫస్ట్ డౌట్ ఉంది.. ఇప్పుడు నమ్మకం ఉంది

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ రంగమార్తాండ. ఈసినిమా రిలీజ్ ఇప్పటికే చాలా లేట్ అయింది అని చెప్పొచ్చు. ఈసినిమా కోసం కృష్ణవంశీ మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఈ సినిమా ఇంకా ఒక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ కూడా చాలా రోజుల నుండి జోరుగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేశారు. రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి.. అంతేకాకుండా ఈసినిమా ప్రీమియర్ షోను చూసిన సినీ సెలబ్రిటీలు ఇప్పటికే పాజిటివ్ రివ్యూలు కూడా ఇచ్చేశారు.

TFN Adminవాట్సాప్
rangamarthanda movie trailer out now
ట్రైలర్ & టీజర్

రంగమార్తాండ ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగమార్తాండ. నానా పాటేకర్ హీరోగా నటించిన మరాఠీ మూవీ ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రంగస్థల నటుడి కష్టాల గురించి తెలియచేస్తూ తీసిన సినిమా ఇది. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా నుండి ఇప్పటివరకూ రిలీజ్ అయిన పోస్టర్లు, అలానే పాటలు సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి.

TFN Adminవాట్సాప్
Rangamarthanda Telugu Movie Review
రివ్యూ

రివ్యూ : రంగమార్తాండ

ఓవరాల్ గా ఉగాది రోజున థియేటర్లలోకి వస్తున్న కృష్ణవంశీ 'రంగమార్తాండ' సినిమా అద్భుతమైన కథ, కథనం, ఎమోషనల్ సీన్స్ తో అందర్నీ ఆట్టుకుంటుంది. ప్రకాష్ రాజ్, బ్రహ్మనందం నటన హైలైట్స్ గా నిలిచిన ఈ సినిమాని ఈ పండగకి పిల్లలు, పెద్దలు అందరూ తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఇది ప్రతి ఇంట్లోని అమ్మ నాన్నల కథ, ఈ తరం, రేపటి తరం తెలుసుకోవాల్సిన గొప్ప కథ.

Mahender Reddyవాట్సాప్
rangamarthanda movie teaser out now
ట్రైలర్ & టీజర్

ఎమోషనల్ రైడ్ గా రంగమార్తాండ టీజర్

టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం నానా పాటేకర్ హీరోగా నటించిన మరాఠీ మూవీ ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఈసినిమా నుండి ఇప్పటివరకూ రిలీజ్ అయిన పోస్టర్లు, అలానే పాటలు సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. దానికి తోడు రీసెంట్ గానే టాలీవుడ్ సెలబ్రిటీలు కొంతమందికి ప్రీమియర్ షో నిర్వహించాడు కృష్ణవంశీ. ఇక సినిమా చూసిన వారందరూ సినిమాపై ప్రశంసలు కురిపించారు. సింగర్ సునీత కూడా తన సోషల్ మీడియా ద్వారా సినిమాపై, కృష్ణవంశీపై…

TFN Adminవాట్సాప్
Singer Sunitha's Reaction after watching Rangamarthanda Movie
సినిమా వార్తలు

రంగమార్తాండ మూవీ పై సింగర్ సునీత స్పందన

హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో మరాఠీ సూపర్ హిట్ నట సామ్రాట్ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన రంగ మార్తాండ మూవీ ఉగాది కానుకగా మార్చి 22 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అనసూయ, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజా ముఖ్య పాత్రలలో నటించారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ మూవీకి మెగా స్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వటం విశేషం. క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
rangamarthanda movie release date announced
రిలీజ్ అప్‌డేట్

రంగమార్తాండ రిలీజ్ డేట్ ఫిక్స్

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో చాలా గ్యాప్ తరువాత వస్తున్న సినిమా రంగమార్తాండ. ఈసినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఎప్పటినుండో ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఎప్పటికప్పుడు ప్రతి అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. అంతేకాదు వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ముఖ్యంగా సోల్ ఆఫ్ రంగమార్తాండ అంటూ వచ్చిన సాంగ్ అలానే బ్రహ్మానందం గ్లింప్స్, ఇంకా పలు పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్